YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వైపు..సీకేబాబు కుటుంబం

వైసీపీ వైపు..సీకేబాబు కుటుంబం

తిరుప‌తి, సెప్టెంబ‌ర్ 21, 
సేకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకేబాబు కుటుంబం మళ్లీ వైసీపీ వైపు చూస్తుంది. ఈసారి నేరుగా సీకే బాబు రాజకీయాల్లో నేరుగా కన్పించకున్నా, ఆయన సతీమణి లావణ్య తో పాటు కుమారుడు సాయికృష్ణను వైసీపీలోకి పంపాలని సీకే బాబు యోచిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో సీకే బాబు చర్చించినట్లు సమాచారం. దీనికితోడు ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు వైఖరిపై కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉండటంతో సీకే బాబును చేర్చుకోవాలని జగన్ కు సన్నిహితుడైన మంత్రి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన లైట్ గా తీసుకుంటున్నారు. వైసీపీ క్యాడర్ ను కాదని తన సొంత మనుషులకు, టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో జంగాలపల్లికి చెక్ పెట్టేందుకు సీకే బాబు కుటుంబాన్ని పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ భావిస్తుందట. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీకే బాబు ఫ్యామిలీ వైసీపీ లో చేరినట్లే.సీకేబాబు ఇప్పుడు అన్ని పార్టీలూ మారారు. నిజానికి సీకేబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయుడు. వైఎస్ హయాంలో ఆయనకు చిత్తూరు జిల్లాలో ఎదురే లేదు. కానీ కొన్ని కారణాలతో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ, టీడీపీలో చేరి ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. సీకే బాబు చేరికతో చిత్తూరు నియోజకవర్గంలో పట్టు అయితే ఉంటుంది. అయితే ఆయనను చేర్చుకోవడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ననే వారుకూడా చిత్తూరు జిల్లా వైసీపీలో ఉన్నారు.ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమాలను సీకే బాబు సతీమణి లావణ్య, సాయికృష్ణలు పాల్గొన్నారు. వైసీపీకి మరింత దగ్గరయ్యేందుకు సీకే బాబు వైసీపీ సీినియర్ నేతతో ఇప్పటికే చర్చించారని సమాచారం. తనకు కాకపోయినా భార్య, కుమారుడిని వైసీపీలోకి తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. మొత్తం మీద సీకేబాబు మళ్లీ వ్యూహం మార్చి చిత్తూరు నియోజకవర్గ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts