YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప‌వ‌న్ కోసం...బీజేపీ పడరాని పాట్లు...

ప‌వ‌న్ కోసం...బీజేపీ పడరాని పాట్లు...

విజ‌య‌వాడ‌ సెప్టెంబ‌ర్ 21, 
పవన్ కళ్యాణ్. సినీ ఆకర్షణ మెండుగా ఉంది. అదే ఇపుడు ఆయనకు మైనస్ గా మారుతోంది. 2019 ఎన్నికల తరువాత మనకెందుకీ రాజకీయాలు అని పవన్ ఒక దశలో అనుకున్నారని చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్ నీవు సామాన్యుడివి కావు, నీకు ఇంత సినీ గ్లామర్ ఉంది, కాస్ట్ ఓటు బ్యాంక్ ఉంది అంటూ ఉబ్బించి మళ్లీ ఇపుడు సీన్ లోకి తెచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ గత మూడేళ్ళుగా రాజకీయాల కారణంగా సినిమాలకు కొంత చెడ్డారు. ఒకపుడు టాలీవుడ్ లో పవన్ నంబర్ వన్ . 2014 ఎన్నికల్లో ఆయన జనసేన పెట్టిన తరువాత రెండు పడవల్లో కాళ్ళు పెట్టేసారు. అలా అన్య మనస్కంగానే మరో రెండు సినిమాలు చేసి 2018 నాటికి పూర్తిగా పొలిటికల్ టచ్ ఇచ్చారు. కనీసం తన పార్టీకి కొన్ని సీట్లు వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫుల్ టైం పాలిటిక్స్ లో ఆయన కొనసాగుదురేమో.ఇక పవన్ కళ్యాణ్ అయిదేళ్ల వరకూ రాజకీయాలతో తన అవసరం అంతగా ఉండదనుకుని మేకప్పు వేసి మరీ కెమెరా ముందుకు వెళ్ళారు. ఆ తరువాత ఆయన్ని మళ్ళీ పొలిటికల్ తెర మీద యాక్టివ్ చేయడానికి బీజేపీ పడరాని పాట్లు పడుతోంది. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి కమల‌నాధులు ఆడుతున్న పాలిటిక్స్ అంతా ఇంతా కాదు, పవన్ పేరు చెబితే యువతరం వెల్లువలా తరలివస్తుంది. అలా తమ పార్టీని పెంచుకోవచ్చునన్న ఆలోచనతో ఆయనకు గేలం వేస్తున్నారు. పొత్తుల పేరిట బీజేపీ వేసిన ఎత్తులకు పవన్ కళ్యాణ్ చిత్తు అయ్యారని అంటున్నారు. తన పార్టీ తన ఇష్టం అని ఆయన అనుకున్ననాడు ఈ జంజాటాలు లేవు. ఇపుడు ఆయన చేత కాషాయం కట్టించి దీక్షలు చేయించి మరీ అపర హిందూ అవతారమెత్తించారు.దీనివల్ల పవన్ కళ్యాణ్ కి ఏకమొత్తంగా ఉన్న సినీ అభిమానుల్లో కలతలు వచ్చేలా ఉన్నాయట. నిజానికి పవన్ కళ్యాణ్ కి కులమతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాలు అంతా చూస్తేనే కదా హిట్ అయ్యేది. కానీ పవన్ని ఒక వర్గం నాయకుడిగా మార్చడానికి బీజేపీ వేస్తున్న వ్యూహాలు ఆయన సినీ కెరీర్ కి కూడా కొంత ఇబ్బంది కలిగేలా ఉన్నాయని అంటున్నారు. మరో వైపు రాజకీయంగా అధికారం తమ కూటమిదేనని చెబుతున్నారు. ఉందిలే మంచి కాలం అంటున్నారు. ఏపీలో అంత సీన్ ఉందా, ఉంటే బీజేపీ తలపండిన రాజకీయ జీవులకు పవన్ కళ్యాణ్ ఎందుకు. వారే మొత్తం మైదానాన్ని దున్నేయవచ్చు కదా. అలా కాదు, అసలు సీన్ వారికి బాగా తెలుసు. అందుకే వారికి పవన్ కళ్యాణ్ ఆకర్షణ కావాలి. దాని కోసం వారు జనసేనానికి మునగచెట్టు ఎక్కిస్తున్నారనే వినిపిస్తున్న మాట.పోనీ బీజేపీ చెబుతున్నట్లుగా 2024 నాటికి కూటమే గెలిచి అధికారంలోకి వస్తే బీజేపీ ఊరుకుంటుందా. ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా చేదా. సోము వీర్రాజుకు ఆశ ఉండదా. అంతెందుకు జాతీయ స్థాయి నుంచి కూడా నాయకులు వరసగా దిగి వచ్చి పీఠం మీద తమ కర్చీఫ్ వేయరా. బీజేపీలో కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు, వారంతా రేసులోకి వచ్చేయరూ. అంటే అద్రుష్టం తలుపు తట్టి సీఎం సీటు దక్కినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ రేసులో నిలబడాలి తప్ప ఆయన్ని అర్జంటుగా అందలం ఎక్కించరు అన్నది గ్యారంటీ. కమలం రాజకీయం తెలిసిన వారు ఎవరైనా ఇదే చెబుతారు. ఈ మాత్రం భాగ్యానికి పవన్ని ఎందుకు ముందుకుపెడుతున్నట్లు అంటే అదే మరి 2014 నుంచి 2018 వరకూ చంద్రబాబు చేసిన పనే ఇపుడు బీజేపీ చేస్తోందన్న మాట. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఈ మొత్తం ఎపిసోడ్ లో బొమ్మ తిరగబడితే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది మాత్రం పవన్ కళ్యాణే అంటున్నారు. 2024 తరువాత మరో మారు జగన్ అధికారంలోకి వస్తే అపుడు పవన్ కి చేసుకునేందుకు సినిమాలు అయినా ఉంటాయా అన్నది పెద్ద డౌటే మరి.

Related Posts