తిరుమల సెప్టెంబర్ 21,
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం సేవ అత్యంత వేడుకుగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదిక పై ఆశీనులైన శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి వారికి వేద మంత్రోచ్ఛనాలు...మంగళ వాయిద్యాల నడుమ కంకణభట్టార్ గోవిందాచార్యులు ఈ కార్యక్రమాని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపనతిరుమంజనం కార్యక్రమంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తూ...ప్రత్యేక మాలలను అలంకరించారు. ఎండుద్రాక్ష,వక్కలు, పసుపుకొమ్మలు,తులసి గింజలు, తామర గింజలు,తమల పాకులు, రోజా పూల రేకులు మరియు పగడపు పూలతో తయారు చేసిన మాలలను ఉత్సవమూర్తులకు అలంకరించారు.స్నపనతిరుమంజ నం నిర్వహించే రంగనాయకుల మండపాని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు,కట్ ఫ్లవర్స్, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు,ఆస్ట్రేలియ బత్తయి,ద్రాక్ష గుత్తులతో సర్వాంగా సుందరంగా అలంకరించారు.శ్రీవారి మూలవిరాట్టు దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ అలంకరణను చూసి మంత్రముగ్దదులయ్యారు.