హైదరాబాద్ సెప్టెంబర్ 21
ప్రైవేట్ యూనివర్సిటీ లతో రూల్ 10 ప్రకారం తెలంగాణకు 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ నేత జేవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణకు 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించిమిగతా 75 శాతం సీట్లు అమ్మకానికి పెట్టారని విమర్శించారు. కార్పొరేట్ విద్యకు అనుకూలంగా వుండే విదంగా నిబంధనలు ఉన్నాయని యన్నారు.రెండేళ్లు తెలంగాణలో ఉంటే స్థానికంగా గుర్తించే విదంగా నిబంధన ఉంది. ఇది తెలంగాణ విద్యార్థులకు విఘాతమన్నారు.25 శాతం కూడా నిండకపోతే ఓపెన్ కేటగిరి లో నింపుతాం అంటున్నారు..ఏ విదంగా సీట్ల భర్తీ చేస్తారు.. ఎక్కడ స్పష్టత లేదు.. సీట్లు అమ్ముకోవడం తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు.ప్రైవేట్ యూనివర్సటీ లో ఏ అనుమతి లేదు, ఏ నిబంధన లేదు.. బహిరంగ వేలం జరుగుతుందని విమర్శించారు.ఫ్యాకల్టీ వివరాలు ఎక్కడ లేవు, నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ లకు యూనివర్సిటీ పేర్లు తగిలించారన్నారు.తెలంగాణ యూనివేర్సిటీ లను ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ లను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.కేసీఆర్ తన తాబేదార్లకు యూనివర్సిటీలు అప్పగించారు.ఒక మంత్రికి, ఒక ఎమ్యెల్సి లకు ఇచ్చారు.. తెలంగాణ లో విద్య ను బజార్లో అమ్మకానికి పెట్టారు.ప్రతి యూనివర్సిటీ తన అడ్మిషన్ల ప్రక్రియ రెండు వారాలు ముందు నోటిఫికేషన్ ఇస్తారు.. ఇక్కడ అలాంటిదేమి లేదని,సామాజిక రిజర్వేషన్ల్ విషయంలో 50 శాతం రిజర్వేషను ఇవ్వకపోతే పేదలకు వెన్నుపోటు పొడిచినట్లే..నన్నారు.ప్రభుత్వం దోస్త్ పేరు తో ప్రక్రియ ఉంది. అలాగే పారదర్శకత పాటిస్తూ ప్రైవేట్ యూనివర్సిటీ లలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఉండాలని జేవన్ రెడ్డి డిమాండ్ చేసారు.