YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముందు ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత‌

ముందు ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత‌

విజ‌య‌వాడ‌, సెప్టెంబ‌ర్  22, 
చంద్రబాబుని అందుకే గండరగండడు అన్నారు. ఆయన రేపటి రోజున ఏం జరుగుతుందో ఊహిస్తారు. ఒకవేళ అలా జరగకపోయినా మరో రూట్ ని కూడా రెడీ చేసి సిద్ధంగా పెట్టుకుంటారు. తాను అనుకున్నది జరగలేదని నిరాశ పడరు సరికదా ఫలితం వచ్చేంతవరకూ పరితపిస్తారు. అదే చంద్రబాబుని ఎక్కడో చంద్రగిరిలో ఎమ్మెల్యే స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ తీసుకువచ్చింది. ఏపీలో ఇప్పటికిపుడు చూస్తే రాజకీయం అంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది. అది ఆయనకూ తెలుసు. ఒక వైపు వైసీపీ కత్తులు నూరుతోంది. సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీ మొత్తానికి మొత్తం యాంటీ అయింది. తోడుగా జనసేన కూడా పొత్తులో ఉంది. దాంతో చంద్రబాబు గొంతు వినిపించకుండానే పొలిటికల్ కధ నడిపించేస్తున్నారు.ఏపీలో బీజేపీ ఊపూ సోము వీర్రాజు మోజు ఎంతకాలం అన్నదే ఇపుడు టీడీపీలో చర్చగా ఉందిట. వచ్చే ఏడాది జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మాత్రం రిజల్ట్ చూపించకపోయినా సోము వీర్రాజును మైనస్ మార్కులు అధినాయకత్వం వద్ద పడతాయి అని అంచనాలు వేస్తున్నారుట. ఇదిలా ఉంటే ఏపీలో సోము వీర్రాజు వచ్చాక అతివాదం పెరిగింది. హిందూ కార్డు ఇపుడు జోరు చేస్తోంది. ఇది ఒక విధంగా జనసేనకు కూడా ఇబ్బందిగా ఉంటుందని, స్వతహాగా ఆ భావజాలం లేని పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఈ వీర హిందూయిజాన్ని మోస్తారని కూడా విశ్లేషణలు కూడా ఉన్నాయి.ఇక ఏపీలో బీజేపీ చిన్న పార్టీ. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మోడీ లాంటి ప్రధాని ఉండొచ్చు, 300 కి పైగా ఎంపీలు ఉండొచ్చు. కానీ ఏపీలో బీజేపీకి నోటా కంటే కూడా తక్కువ ఓట్లే పడ్డాయన్నది నిజం. అదే సమయంలో జనసేనకు ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, బలమైన సామాజిక వర్గం కూడా ఉన్నాయి. ఆయన అందరి వాడుగా రాజకీయాల్లో ఉండాలని ఆయన అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కానీ పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దీక్షలు చేయడం నచ్చని వారు ఆ పార్టీలో కూడా ఉన్నారుట. ఇవాళ కాకపోయినా రేపు అయినా బీజేపీలోని మేధావి వర్గం కానీ చదువరులు కానీ దీని మీద అసంత్రుప్తి గట్టిగా వ్యక్తం చేస్తే పవన్ తన రూటు మార్చుకోవాల్సిరావడం ఖాయం. ఇక పవన్ కూడా బీజేపీ పెద్దన్న పోకడల పట్ల కొంత ఆలోచన చేస్తున్నారని అంటున్న వారూ ఉన్నారు.వస్తే బీజేపీ, జనసేనా రెండూ కలసి రావాలి. అపుడు 2014 ఎన్నికల ఎన్నికల మాదిరిగా మళ్ళీ పొత్తు ఉంటుంది. లేకపోయినా ఎన్నికల వేళకు జనసేన అయినా కలసివస్తుందని టీడీపీకి తెగ నమ్మకమట. ఒకవేళ జనసేనను దగ్గరకు చేస్తే ఆటోమేటిక్ గా బీజేపీ కూడా వస్తుంది. లేకపోతే వారికి వేరే ఆప్షన్ లేదు అన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. బీజేపీతో పొత్తుకు వైసీపీ ఎటూ ఓకే చెప్పదు, ఇక మళ్లీ ఒంటరి పోరు చేయడానికి బీజేపీ అసలు సాహసించరు. ఈ రకమైన లెక్కలు దగ్గర ఉండబట్టే చంద్రబాబు ధీమాగా ఉన్నారుట. మొత్తానికి పొత్తుల ఎత్తులో తాను కింగ్ నని బాబు మరో మారు నిరూపించుకుంటారా. వెయిట్ అండ్ సీ.

Related Posts