YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నాడీఎంకేలో శశికళ కలవరం

అన్నాడీఎంకేలో శశికళ  కలవరం

చెన్నై, సెప్టెంబ‌ర్ 22, 
మరోసారి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ఉత్సాహంగా ఉంది. తమిళనాడులో ఆ పార్టీ కార్యాలయాలు సందడి సందడిగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం శశికళ జైలు నుంచి విడుదల అవుతున్నారని వార్త రావడమే. శశికళ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ మేరకు పరప్పణ అగ్రహార జైలు అధికారులు సయితం సంకేతాలు ఇచ్చారు. వచ్చే నెలలో ఎప్పుడైనా శశికళ విడుదలయ్యే అవకాశముంది.శశికళ జయలలిత అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకెళ్లారు. దాదాపు మూడేళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు నాలుగేళ్ల శిక్ష ఈ కేసులో పడింది. అయితే సత్ప్రవర్తన కారణంగా ఆమెను శిక్షా కాలం కంటే ముందుగానే విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జైలుకెళ్లిన తొలి రోజుల్లో కొన్ని వివాదాలు బయటకు వచ్చినా ఆ తర్వాత శశికళ జైలు నిబంధనల మేరకే నడుచుకుంటున్నారు.
శశికళ వచ్చిన వెంటనే ఉండేందుకు పోయెస్ గార్డెన్ కు సమీపంలో ఒక బంగళాను సిద్దం చేశారు. అయితే ఆ స్థలాన్ని ఇటీవల ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అదే ప్రాంతంలో మరో బంగళాను దినకరన్ రెడీ చేసినట్లు సమాచారం. శశికళ వచ్చి అక్కడ ఉండి పార్టీ కార్యక్రమాలు చూసుకునేలా దినకరన్ ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కార్యాలయంలోనూ శశికళకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండటంతో శశికళ రాక రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు అధికార అన్నాడీఎంకే నుంచి పెద్దయెత్తున వలసలు ఉంటాయని కూడా దినరకన్ చెబుతున్నారు. శశికళ వచ్చిన తర్వాత అధికార పార్టీ నుంచి అనేక మంది నేతలు చేరతారని, వీరిలో మంత్రులు కూడా ఉన్నారని దినకరన్ అంటున్నారు. మొత్తం మీద శశికళ రావడం ఖాయమయిందన్న వార్తల నేపథ్యంలో అన్నాడీఎంకేలో కూడా కలవరం ప్రారంభమయింది. మరి శశికళ వచ్చిన తర్వాత అన్నాడీఎంకేలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts