YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

బ‌డి బాట‌లో టీచ‌ర్స్

బ‌డి బాట‌లో టీచ‌ర్స్

హైద్రాబాద్‌, సెప్టెంబ‌ర్  22, 
ఉపాధ్యాయులు బడిబాట పట్టరు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌-4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలు మూసి ఉంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌తో పాటు ఆన్‌లైన్‌ క్లాసుల పర్యవేక్షణకు పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండడంతో విద్యాసంస్థలు ఈ నెల 20వరకు మూసి ఉంచాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రరాంచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఆగస్టు 27 నుంచి బడిబాట పట్టిన పంతుళ్లు ఆదివారం వరకు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.ఇక ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు 21వ తేదీ నుంచి విధులకు హాజరయ్యేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 50 శాతం టీచర్లు పాఠశాలలకు 'ఆల్టర్నెట్‌' పద్ధతిలో హాజరు కావాల్సిఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్‌లోని ఒక పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ ఆరుగురు టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో ముగ్గురు టీచర్లు ఒక రోజు రావాల్సి ఉండగా.. మిగతా నలుగురు మరోక రోజు రావాల్సి ఉంటుంది.పాఠశాలలకు హాజరు కానీ రోజు ఆటెండెన్స్‌ రిజిస్టర్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హౌం అని మార్కు చేయాలని సమాచారం. పీహెచ్‌సీ టీచర్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులు హాజరు రిజిస్టర్‌లో పేర్ల ప్రకారం జాబితాను తయారు చేసుకొని రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసుకోవాలి. సగం మంది టీచర్లు బడులకు వచ్చి విద్యార్థుల ఇండ్లను సందర్శించాల్సి ఉంటుంది. మిగిలిన వారు ఇంటి నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా చూడాల్సి ఉంది. హెడ్‌ మాస్టర్లు..టీచర్ల పనితీరును సెల్‌ఫోన్ల ద్వారా పర్యవేక్షించడంతో పాటు విద్యార్థులను పర్యవేక్షించి వివరాలు ఎంట్రీలను ప్రతిరోజు రికార్డుల్లో నమోదు చేయాలి. 9,10 తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలకు సంబంధించి పాఠశాలలో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.కొవిడ్‌-19 నిబంధనల మేరకు రెండు గంటల కాల వ్యవధి వరకు ఉండవచ్చు. విద్యార్థుల వివరాలను జిల్లా ఉప విద్యాశాఖాధికారుల ద్వారా డీఈవోలకు పంపించాలి. రెగ్యులర్‌గా పాఠశాలకు ఎప్పటి నుంచి హాజరు అవుతారో తల్లిదండ్రుల అభిప్రాయాలను విద్యార్థుల ద్వారా సేకరించాలని, ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఉండదని, విద్యార్థులు తాగునీటి బాటిళ్లను కూడా ఇంటి నుంచే తెచ్చుకునేలా ఆదేశాలలో పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున వారు భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్లు వాడేలా జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేశారు.

Related Posts