హైద్రాబాద్, సెప్టెంబర్ 22,
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిటీ బస్సుల ఈ నెలాఖరును రోడ్డు ఎక్కిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత 10 రోజులకు క్రితమే మెట్రో రైళ్ళు అన్ని మార్గాల్లోనూ నడుస్తున్నాయి. అయితే, అవి కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కావడం, సామాన్య ప్రయాణికులకు అందుబాటులో చార్జీలు లేక పోవడంతో వాటికి ప్రయాణికుల నుంచి స్సందన అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. వీటిలో కేవలం ఐటీ ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు మాత్రమే రాక పోకలు సాగిస్తున్నారు. ఇప్పడిప్పుడిప్పుడే నగరంలో ఆటోలు, క్యాబ్‌లు, నగరం ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే వాటిలో సామాన్య మద్యతరగతి ప్రజలు ఎక్కేందుకు అంతకు ఇష్టపడం లేదు. దానికి ప్రధాన కారణం వాటిలో చార్జీలు అధికంగా ఉండటమే. సిద్దం పడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సిటీ బస్సులు నడిపే ఇటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఆదాయం పరంగా ఆర్టిసి కూడా కొంత గాడిలో పడే అవకాశం ఉంది. ఆర్టిసి ఆధ్వర్యంలో కార్గో బస్సులను నడుస్తున్నా వాటి ద్వారా వచ్చే ఆదాయం కనీస అవసరాలు తీరక పోవడంతో అధికారులు నగరంలో సిటీ బస్సులను తిప్పిందుకు సిద్ద పడుతున్నారు.గతంలో మాదిరిగా నగరంలో కరోనా ప్రభావం అంతగ లేక పోవడంతో సిటీ బస్సులను రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే నగరంలో సిటీ బస్సులకు తిప్పేందుకు సిద్దంగా ఉండాలని సంబంధిత మంత్రి ఆదేశించినా అప్పడు నగరంలో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు అనువుగా ఉండటంతో బస్సులను ఈ నెలాఖరు నుంచి బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులు క్రితం నుంచేపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ బస్సులకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ నెలాఖరు నుంచి సిటీలో బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పోరుగు రాష్ట్రమైన ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణాల్లో తిరుగుతున్న సిటీబస్సులకు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన ఏంటి? చార్జీలను ఏమైనా పెంచారా? సిటీ బస్సుల్లో కోవిడ్ నిబంధనలు పాటించడం ఎంత వరకు సాధ్యం, బస్సులను అన్ని రూట్లలో నడిపాలా లేదా. అనే అంశాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. బస్సులు నగరంలో తిరుగుతున్న సమయంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు అన్ని రకరాల చర్యలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న మరమ్మతులను నిర్వహిస్తు న్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే బస్సులను తిప్పేందుకు తాము అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.