YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

టీఆర్ఎస్‌తో పాటు విప‌క్షాల రాజ్య‌స‌భ స‌మావేశాల‌ బ‌హిష్క‌ర‌ణ‌

 టీఆర్ఎస్‌తో పాటు విప‌క్షాల రాజ్య‌స‌భ స‌మావేశాల‌ బ‌హిష్క‌ర‌ణ‌

హైదరాబాద్ సెప్టెంబర్ 22  
అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. టీఆర్ఎస్‌తో పాటు రాజ్య‌స‌భలోని విప‌క్ష పార్టీల‌న్నీ సెస్ష‌న్‌ను బ‌హిష్క‌రించాయి.  కాంగ్రెస్‌, డీఎంకే, తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆర్జేడీ, శివ‌సేన‌, వామ‌ప‌క్ష‌, ఆప్ పార్టీలు కూడా స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్నాయి. 8 మంది స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేసే వ‌ర‌కు తాము స‌భ‌ను బ‌య్‌కాట్ చేయ‌నున్న‌ట్లు ఆజాద్ తెలిపారు. స్వామినాథ‌న్ ఫార్ములా ప్ర‌కారం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను ఫిక్స్ చేయాల‌న్నారు. స‌భా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో..  ఇవాళ రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు.  వ్య‌వ‌సాయ బిల్లుపై ఓటింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ్య‌తిరేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తుచేస్తూ.. ఆ సంఘ‌ట‌నల‌ను ఆయ‌న ఖండిస్తున్న‌ట్లు తెలిపారు.  కేవ‌లం స‌మ‌యం పొడిగించాల‌ని కోరిన‌ప్పుడే ఈ సంఘ‌ట‌న ఎందుకు జ‌రిగింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  రూల్ 252 అంశం గురించి ప్ర‌స్తావిస్తూ.. ఆంగ్ల‌దిన‌ప‌త్రిక ది హిందూలో వ‌చ్చిన ఎడిటోరియ‌ల్‌ను ఆయ‌న గుర్తు చేశారు.  ఆ క‌థ‌నం ప‌ట్ల చాలా బ్యాడ్‌గా ఫీల‌వుతున్న‌ట్లు తెలిపారు. 252 సీ రూల్ ప్ర‌కారం డివిజ‌న్ కోసం 3 నిమిషాల స‌మ‌యం ఇవ్వాల‌ని, కానీ అలా చేయ‌లేద‌న్నారు. ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని కోరారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో దీక్ష చేప‌డుతున్న ఎంపీల‌కు మ‌ద్ద‌తుగా రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను టీఆర్ఎస్ బ‌హిష్క‌రించింది.

Related Posts