సూర్యాపేట సెప్టెంబర్ 22
సూర్యాపేట జిల్లాలో భారీ బంగారం చోరీ కేసుని సూర్యాపేట జిల్లా పోలీసులు చేధించారు. జులై నెలలో కరోనా చికిత్స నిమిత్తం ఇంటికి తాళాలు వేసి హైద్రాబాద్ కు వెళ్లిన జిల్లాలోని మట్టంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన చీదేళ్ల సత్యనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి 30 లక్షలు విలువ చేసే 60 తులాల బంగారం,వెండి రికవరీ చేసారు పోలీసులు. చికిత్స నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్తుండటంతో ఇదే అదునుగా అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్న 62 తులాల బంగారం తో పాటు వెండి, నగదును చోరీ చేశారు. చాకచక్యంగా కేసుని ఛేదించిన పోలీసులు... నిందితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.. చోరీ మొత్తం సొమ్ముని రికవరీ చేసిన పోలీసులు, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు.