మేడ్చల్ సెప్టెంబర్ 22
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వెంకటసాయి ఆసుపత్రిలో పసిపల్లలను ఎత్తుక పోవడానికి వచ్చి నట్లు ఒక మహిళపై పిర్యాదు రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘట్కేసర్ మండల కేంద్రంలోని వెంకటసాయి ఆసుపత్రి ఓ మహిళ పసికందుకు జన్మనిచ్చి చికిత్సా పొందుతుంది. అసుపత్రిలో రాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ అసుపత్రి లోపలికి వచ్చి తోడుగా ఉన్న ఆయాకు మత్తు గోళీలు ఇచ్చి పసికందును ఎత్తుక పోయేందు యత్నించిందంటు బాలింత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని మహిళ అక్కడ సంచరించడంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. అసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ప్రశ్నించగా పొంతన లేని సమధానం ఇచ్చింది. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సదరు ఆ మహిళ చిన్న పిల్లలను ఎత్తు కేళ్ళేందుకే వచ్చిందా, ఎందకు వచ్చింది దుకు వచ్చిందని పోలీసులు విచారిస్తున్నారు.