తిరుమల సెప్టెంబర్ 22
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి పరిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 23న గరుడసేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు రానున్న నేపథ్యంలో సిఎం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు… బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి శ్రీవారి ఆలయం వరకు, నాదనీరాజనం వేదిక వద్ద భద్రత ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 24న ఉదయం 7 గంటలకు శ్రీవారి దర్శనంతరం ఏపీ , కర్ణాటక ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, బిఎస్.యడ్యూరప్ప లు నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. వేదికపై భద్రత, అలంకరణ, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా ఐజి శశిధర్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ ను ఎయిర్ పోర్ట్ నుండి తిరుమల వరకు విజయవంతం గా పూర్తి చేశారు...సీఎం తిరుమల పర్యటన నేపథ్యంలో రెండు ఘాట్ రోడ్లలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.