YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

‘ఏ మతంపైనా జగన్‌కు విశ్వాసం లేదు’

‘ఏ మతంపైనా జగన్‌కు విశ్వాసం లేదు’

అమరావతి సెప్టెంబర్ 22 

ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తున్నారు   పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్‌  ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా సీఎం జగన్‌కు విశ్వాసం లేదని ఆయన ఆరోపించారు. తెదేపా సీనియర్‌ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, వైకాపా నేతల తీరుపై విమర్శలు చేశారు. సీఎం ఏ మతస్థుడైనా కావొచ్చని.. అన్ని మతాలనూ ఆయన సమదృష్టితో చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత అతనిపై ఉందని చెప్పారు. ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు.  26 విచారణలు..ఏదీ రుజువు చేయలేకపోయారు  రూ.770 కోట్లు ఖర్చు చేసిన ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందా? వైకాపా తప్పుడు ప్రచారానికి ఇంకేం రుజువు కావాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపాపై కక్ష సాధింపే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై వైకాపా ఎంపీలకు దృష్టి లేదని విమర్శించారు. సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అన్యాయంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని 80 రోజులు జైలుకు పంపారన్నారు. ప్రలోభాలు పెట్టి కొందరిని లాక్కున్నంత మాత్రాన తెదేపాకు వచ్చిన నష్టమేమీ లేదని.. పార్టీ నుంచి ఒకరు పోతే వందమందిని తయారు చేసే సత్తా తెదేపాకు ఉందని స్పష్టం చేశారు. రాజీనామా చేయించాకే పార్టీలోకి తీసుకుంటామన్న జగన్‌ మాట ఏమైందని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో తనపై 26 విచారణలు చేయించి ఏదీ రుజువు చేయలేకపోయారన్నారు. రైతు పంపు సెట్లకు మీటర్ల ఏర్పాటును ప్రతిఘటించాలని.. అన్ని ప్రాంతాల్లో రైతులకు తెదేపా నేతలు అండగా ఉండాలని ఆయన సూచించారు.

Related Posts