YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రిప‌బ్లిక్ పార్టీలోకి కంగ‌నా

రిప‌బ్లిక్ పార్టీలోకి కంగ‌నా

ముంబై‌, సెప్టెంబ‌ర్ 23. 
హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకత..తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. అంతేనా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు తెచ్చుకుంది..ఆమె నోటికి పెద్ద పెద్ద స్టార్స్ తో పాటు ప్రముఖ దర్శకులు కూడా భయపడతారంటే అతిశయోక్తి కాదేమో. ఈమెకి తోడుగా కంగనా సోదరి రంగోలి కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లోకి వస్తే..తనకి శత్రువు అనుకున్న వారందరి పని గోవిందా గోవిందనే.అసలు కంగనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు అంటే రీజన్స్ చాలానే ఉన్నాయి.  బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై కంగనా కూడా తన గళాన్ని బలంగా వినిపించారు కూడా. అంతేకాదు ముంబైయిని  పాకిస్థాన్ తో పోల్చడంతో  మొదలైంది అసలు రచ్చ.  సుశాంత్ ఆత్మహత్య ఎపిసోడ్ లో మహారాష్ట్ర అధికారపక్షం ఇరుకున పడేలా కంగనా మాట్లాడటం.. ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఆమె ఆఫీసులోని లోపాల్ని ఎత్తి చూపించారు.అంతటితో ఆగలేదు యుద్ధ ప్రాతిపదికన ఆమె ఆఫీసును కూల్చేందుకు సిద్దం కావటం.. కోర్టు ఆదేశాలు వచ్చే నాటికి పాక్షికంగా కూల్చివేతలు జరిగిపోయాయి. కంగనాని పలుకరించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి రాందాస్.. ఆమెను తమ పార్టీలో చేరాలని కోరారట.. అందుకు ఆమె   దాదాపుగా సమ్మతించినట్లుగా సమాచారం. మహారాష్ట్ర లోని శివసేన సర్కారుకు బీజేపీకి పడదని అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ స్టాండ్ ను సమర్థవంతంగా వినిపించటంతో పాటు.. అధికార పక్షాన్ని ఇరుకున పడేయటంలో కంగనా సక్సెస్ అయింది. ఆ గొడవల కారణంగా  కంగనకు వై ప్లస్ భద్రతను కల్పించటం గమనార్హం.బిజెపికి సపోర్ట్ గా మాట్లాడే కంగనా  అందరూ అనుకుంటున్నట్లుగా  బీజేపీలో చేరటం లేదట.  బీజేపీ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీర్థం తీసుకోనుందట కంగనా. ఈ పార్టీ ఎక్కడ ఉందని అనుకుంటున్నారా..కేంద్రమంత్రి రాందాస్ అధవాలే  ఈ మధ్యనే ముంబయిలోని కంగనా ఇంటికి వెళ్లి మరీ.. పరామర్శించి వచ్చారు కదా. ఆయన నడిపే పార్టీలో ఆమె చేరనున్నట్లు టాక్.ఇదంతా పక్కన పెడితే  ఇంతకీ కంగనాను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? దాని వెనకున్న ప్లాన్ ఏమిటన్నది చూద్దాం. రాజ్ పుత్ వర్గానికి చెందిన కంగనాను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా.. వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే వీలుంది. గుజరాత్.. రాజస్థాన్ లలో వారి ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. అందుకే కంగన పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖరారైయిందట.మహారాష్ట్రకు చెందిన అధవాలే పార్టీ అండ కంగనాకు సంపూర్ణంగా ఉంటుందని.. అందుకు ప్రతిగా ఆమె పార్టీలో చేరితే బాగుంటుందన్న ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరుగుతుందనగానే.. ఆ వాదనకు బలం చేకూరేలా రాందాస్ తో ఆమె భేటీ అయిన ఫోటోలు బ్యానర్లు.. ఫ్లెక్సీల రూపంలో దర్శనమివ్వటం విశేషం. త్వరలో జరిగే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కంగనా  సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందట. రాజస్థాన్.. గుజరాత్ లలో జరిగే స్థానిక ఎన్నికల్లో కంగనా ఛరిష్మా..ఆ  పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మరి.. ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ కంగనాకి అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేనో లేక ఎంపీనో అయిందంటే బాలీవుడ్ లోని లొసుగులతో పాటు తనని వేలెత్తి చూపిన వారందరి బరతం పట్టకమానదు కంగనా.

Related Posts