YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

50 కోట్ల అక్రమాస్తులు.. మల్కాజ్ గిరి ఏసీపీ ఇంట్లో సోదాలు

50 కోట్ల అక్రమాస్తులు.. మల్కాజ్ గిరి ఏసీపీ ఇంట్లో సోదాలు

హైదరాబాద్ సెప్టెంబ‌ర్ 23. 
మల్కాజ్ గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు జరిపారు. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి ఏసీపీ గా నర్సింహారెడ్డి పని చేశారు. అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కోన్నారు. అయన రూ. 50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి అయన అల్లుడు . హైదరాబాద్లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట, ఉప్పల్, వరంగల్లో మూడు చోట్ల, కరీంనగర్లో రెండు చోట్ల, , నల్లగొండలోరెండు2 చోట్ల, అనంతపూర్ లలో సోదాలు జరిపారు. అయనతో పాటు అతని కుటుంబీకులు ఇళ్లల్లో కొనసాగుతున్న ఎసిబి సోదాలు జరిగాయి.

Related Posts