హైదరాబాద్ సెప్టెంబర్ 23.
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లోటస్ పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటిని బజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టించారు. ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.