చిత్తూరు సెప్టెంబర్ 23.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లాలో పలువురు తెదేపా, భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నిరసన కార్యక్రమాల పిలుపుతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు మరికొందరు నేతల నివాసాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. భాజపా నేత భానుప్రకాశ్రెడ్డితోపాటు మరికొందరిని గృహనిర్బంధం చేశారు. పుంగనూరు తెదేపా ఇన్ఛార్జి అనీషారెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్ అయ్యారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. అయన ఇంటి నుంచి ఎవరు బయటకు రాకుండా గేటు వద్దే పోలీసులు కూర్చున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. మరోవైపు, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ కుడా హౌస్ అరెస్ట్ అయ్యారు. అయన ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిలు హౌస్ అరెస్ట్ అయ్యారు. సత్యవేడు టీడీపీ ఇన్ చార్జ్ రాజశేఖర్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిలను గృహనిర్బంధంలో వుంచారు.