YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

క‌మ‌లానికి దూర‌మ‌వుతున్న మిత్రులు

క‌మ‌లానికి దూర‌మ‌వుతున్న మిత్రులు

న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 24,
భారతీయ జనతా పార్టీకి పాతమిత్రులందరూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా పంజాబ్ లోని ప్రధాన పార్టీ శిరోణి అకాలీదళ్ కూడా బీజేపీ నాయకత్వం, ప్రభుత్వం తీరుపట్ల అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో, బీజేపీ బలహీనంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీ వైపు నిలిచాయి. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదన్న కారణంతో దేశంలో అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచాయి.వాజపేయి కాలం నుంచే అవి బీజేపీ వెంట నడుస్తూనే ఉన్నాయి. శివసేన, అకాలీదళ్, తెలుగుదేశం, బిజూజనతాదళ్ వంటి పార్టీలు నాటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయి. బిజూ జనతాదళ్ తర్వాత ఎన్డీఏకు తనంతట తానే దూరమయింది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా కొన్నిసార్లు మిత్రుడిగా ఉండటం, మరోసారి బీజేపీని దూరం పెట్టడం వంటివి జరిగాయి. కానీ శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు మాత్రం తొలి నుంచి బీజేపీని తమ నమ్మకమైన మిత్రుడిగానే భావిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ గత ఎనికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. దీంతో ఏపీలో విడిగా పోటీ చేయడంతో బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన శివసేన, బీజేపీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో విభేదాలు తలెత్తడంతో శివసేన బీజేపీకి బైబై చెప్పింది. రెండు పార్టీల సిద్ధాంతాలు ఒక్కటే అయినప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో అది కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి బీజేపీకి ఝలక్ ఇచ్చింది.ఇక తాజాగా పంజాబ్ లో ఉన్న శిరోమణి అకాలీదళ్ కూడా కేంద్ర ప్రభుత్వం తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులను వ్యతిరేకించాలని నిర్ణయించింది. ప్రధానంగా వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు అకాలీదళ్ ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న మైత్రీ బంధాన్ని కాదనుకుని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించడాన్ని బట్టి భవిష్యత్ లో శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్టీఏ నుంచి వేరపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి

Related Posts