YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య మాట‌ల యుద్ధం

బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య మాట‌ల యుద్ధం

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 24, 
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది..? ఎంత ఖర్చు పెట్టారు..? ఇప్పుడు ఇది బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య మాటల మంటలకు కారణం అవుతోంది. తెలంగాణలో కరోనా కట్టడికి రూ. 290 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. అంతకు ముందు రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ .. తెలంగాణకు కేంద్రం రూ. ఏడు వేల కోట్లు ఇచ్చిందని ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటనలను ఒకే ట్వీట్‌లో పెట్టిన కేటీఆర్… బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక బీజేపీ ఎంపీలు ఊరుకుంటారా..? రంగంలోకి దిగి.. విమర్శల వర్షం అందుకున్నారు. కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ.. మొదట విమర్శల వర్షం అందుకున్నారు. బండి సంజయ్ చెప్పింది.. కరోనా సమయంలో… కేంద్రం తెలంగాణ అందించిన సాయం వివరాలని.. ఒక్క కరోనా కట్టడికి మాత్రమే కాదని..అరవింద్ ప్రకటించారు. ఈ వివరాలను చెప్పకుండా కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలో పీఎం కిసాన్‌ , జనధన్‌ , ఉజ్వల పథకం , భవన నిర్మాణ కార్మికులకు సాయం, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆహార భద్రత పథకం కింద మొత్తం ఇచ్చిన నిధుల వివరాలను బండి సంజయ్ వెల్లడించారు. అంతే కాదు.. కరోనా కట్టడి కోసం.. కేంద్రం రూ. 290 కోట్లు ఇస్తే తెలంగాణ సర్కార్ ఆ నిధుల్లోనూ కేవలం రూ. 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని లెక్కలు బయట పెట్టారు. అయితే.. అరవింద్ విమర్శలపై టీఆర్ఎస్ భగ్గు మంది. అరవింద్‌కు సంస్కారం లేదని.. మండిపడ్డారు. రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి చెబితే.. బీజేపీ నేతలు మాత్రం ఏడు వేల కోట్లిచ్చారని అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు. ఈ మాటల మంటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు పన్నుల రూపంలో ఇవ్వాల్సిన వాటను కూడా…. ఏదో కేంద్ర సాయం అన్నట్లుగా చెబుతూండటంతో సమస్య వస్తోంది. తెలంగాణ నుంచి పన్నులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముందు ముందు ఈ నిధుల ఫైట్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఒకరిని మించి ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవడానికి వెనుకాడటం లేదు.

Related Posts