YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొడాలి నానిని తొలగించాలి

కొడాలి నానిని తొలగించాలి

శ్రీకాళహస్తి సెప్టెంబ‌ర్ 24,
శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయం వద్ద బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ని కించపరిచే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని వెంటనే మంత్రి మండలి నుంచి తొలగించాలి హిందూ సమాజాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.
బిజెపి నాయకులు కాస రం రమేష్, శైలజ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన హిందుత్వం పై జరుగుతున్న దాడులు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. వెంటనే మంత్రి మండలి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించక పోవడం గమనిస్తే ఆయన ప్రోత్సహించే విధంగా ఉందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని లేకుంటే రాష్ట్ర స్థాయిలో బిజెపి పెద్ద ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమేష్ బాబు, పద్మజా, ప్రసాద్, మహేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి కిషోర్ రామయ్య మునిరెడ్డి చిలక రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts