YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఫార్మా కంపెనీల కాలుష్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విశాఖ ఫార్మా కంపెనీల కాలుష్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి  సెప్టెంబర్ 24
విశాఖ ఫార్మా కంపెనీల కాలుష్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.  ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది.  విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.   పరవాడ ఔషధ కంపెనీల నుంచి విషతుల్య రసాయనాలను సముద్ర తీరం, సమీపంలోని చెరువుల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్నారన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.  మరోవైపు తీరంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతుండటంతో తీర ప్రాంతం కలుషితమైందన్నారు.   అక్కడి వృక్షాలు, జంతుజాలానికి, మత్స్యకారుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.  ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది.

Related Posts