విజయవాడ, సెప్టెంబర్ 25,
130 సీసీ టీవీలు, 12వందల మంది స్టాఫ్.. 5 లక్షల రూపాయాల విలువైన విగ్రహాలు మాయం. అసలు నిఘా నీడలో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి. అంతటి సాహసం ఎవరు చేసి ఉంటారు. దేవుడి సొమ్ముకే భద్రత ఉండదా దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. విజయవాడ దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. ఆలయంలో ఏ వస్తువు మిస్ అయిన తిరిగి దొరికిన సందర్భాలు లేవు. గతంలో ఖరీదైన పట్టు చీర మిస్ అయితే దాని పోగు కూడా పట్టుకోలేకపోయారు. అంటే దుర్గమ్మ ఆలయంలో దొంగతనాలు పకడ్బంధీగా జరుగుతున్నాయన్నమాట. ప్రస్తుతం అత్యంత విలువైన వెండి సింహాలు మాయం అయ్యాయి. ఈ ఘటనపై ఈవో, దేవాదాయ శాఖ మంత్రి పొంతనలేని వివరణలు ఇస్తూ విపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. దుర్గగుడిలో 130 సీసీ కెమెరాలున్నాయి. 12వందల మంది పహారా కాస్తున్నారు. చీమ చిట్టుక్కుమన్న తెలుసుకునేంతా టెక్నాలాజీ ఉంది. అయినా సింహాలు మాయమై ఇన్ని రోజులవుతున్న విగ్రహా దొంగలను పసిగట్టలేకపోయారు. అయితే ఇక్కడ డేటా స్టోరేజీ సిస్టమ్ లేకపోవడం వల్లే దొంగలను గుర్తించలేకపోతున్నారని తెలుస్తోంది. విగ్రహాల మిస్సింగ్ ఘటనపై క్రైం బ్రాంచ్ డీసీపీ కోటేశ్వరరావు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అయితే ఆయన విచారణలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఆలయంలోని వెండి, బంగారం ఇత్తడి వస్తువులను పాలిషింగ్ చేసే కాంట్రాక్ట్ ను శ్రీ శర్వాని ఇండస్ట్రీ తీసుకుంది. ఆ సంస్థ నుంచి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఉగాది సందర్భంగా రథానికి వెంకట్ పాలీష్ చేశాడు. ఇదే విషయాన్ని అప్రైజెర్ షమీ పోలీసులకు వివరించాడు. అయితే సబ్ కాంట్రక్టర్ వెంకట్ ప్రస్తుతం ఎవరికి టచ్ లో లేడు. అతని ఫోన్ స్వీచ్ ఆఫ్ వస్తోంది.లాక్ డౌన్ సమయంలోనే వెండి ప్రతిమలు చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా రథాన్ని పాలీష్ చేశారు. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగం, స్తపతి, పాలీష్ పెట్టేవారు, అప్రిజర్ నుంచి వివరాల సేకరిస్తున్నారు. విగ్రహాల దొంగతనం జరిగాక రథంపై కవర్ కప్పారు. ఇదే పని ముందు చేస్తే ఈ గొడవే ఉండేది కాదని స్థానిక భక్తులు అనుకుంటున్నారు.