YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హిందూ మనోభావాలను కించపరచడం హేయమైన చర్య

హిందూ మనోభావాలను కించపరచడం  హేయమైన చర్య

విజయవాడ సెప్టెంబ‌ర్ 25, 

హిందూ మనోభావాలను కించపరచడం  హేయమైన చర్య  దేవుళ్ళ పై పరంపరగా జరుగుతున్న   దాడులను అందరూ  ఖండించాలి
డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి కి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరికి నిరసనగా మైలవరం  వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు "పరిహార పూజా కార్యక్రమం" నిర్వహించారు. తరువాత అయన  మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఎవరైతే అన్యమతస్తులు దేవాలయం దర్శనం చేసుకునే టప్పుడు పేరు మతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల విశ్వాసం గౌరవం నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టి దర్శనం చేసుకోవడం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయమని అన్నారు.  ఈ నమ్మకం విశ్వాసం ఈరోజు వచ్చింది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి అనాదిగా ఈ కార్యక్రమం ఎవరు విదేశాల నుంచి వచ్చిన ఎంత పెద్ద వారు వచ్చిన ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ  కూడా విదేశాల నుంచి ఎవరైనా దేవాలయం స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా డిక్లరేషన్ పట్ల శ్రద్ధ తీసుకోవడం కానీ భక్తిప్రపత్తులతో కార్యక్రమాలు అన్నీ కూడా నడిచాయని అయన అన్నారు.  అబ్దుల్ కలాం  దేవాలయానికి వచ్చి నప్పుడు ఆయన్ని ఎవరూ అడగలేదు ఆయనే ఏమైనా బంగారు వాకిలి దగ్గర నిలబడి డిక్లరేషన్ ఇవ్వాలి సంతకం పెట్టాలి దానికి సంబంధించిన సమగ్ర రికార్డు అంత తీసుకురండి అని చెప్పి ఆయన ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి శ్రద్ధ గౌరవం విశ్వాసం నమ్మకం అంతా కూడా ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయుడు అబ్దుల్ కలామని అయన అన్నారు.  నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు టిటిడి బోర్డు వారు వచ్చే రిక్వెస్ట్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారి ని రిక్వెస్ట్ చేస్తే మేము వెళ్ళాము మీరు ఎవరితో ఆటలు ఆడుకుంటున్నారు .  ఇవాళ ఈ చర్చ జరుగుతున్న సమయంలో డిక్లరేషన్ మీద ఈ వివాదాన్ని లేవనెత్తింది టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి గారు అన్యమతస్తులు ఎవరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ఈ చర్చను లేవనెత్తారు. మళ్లీ ఆ వివాదాన్ని దృష్టి మరల్చడానికి క్యాబినెట్ మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగి అంతర్వేదిలో రథం తగలబెడితే ఏముంది ఒక కోటి రూపాయలు ఒక రథం కోటి రూపాయలు అవుతుంది కదా దాంట్లో ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నాడు.  అమ్మవారి వెండి సింహాలు అంటే పోయాయి అంటే వెండి సింహాలే కదా ఒక ఆరేడు లక్షల తో మిద్దెలు కడతారా మేడలు కడతారు అని అంటున్నాడు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి అపచారం జరిగింది అని అడిగితే బొమ్మే కదా అని మాట్లాడారు . అదేవిధంగా ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి డిక్లరేషన్ కు సంబంధించి ఎందుకు ఇవ్వాలి ఈ దరిద్రపు చట్టాలు మార్చాలి ఈ చట్టాలను మార్చాలని వాళ్ల నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. బాధ్యతారహితంగా మాట్లాడితే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ లేదు ఖండించలేదు తప్పు అని చెప్పలేదని అన్నారు.  ఉదాసీన వైఖరితో ఒక నిర్లక్ష్య వైఖరితో బాధ్యతారాహిత్యంగా చిద్విలాసంగా ఏ మాత్రం కూడా ఖండించకుండా పెద్ద ఎత్తున స్వాములు పెద్ద ఎత్తున భక్తి విశ్వాసాలతో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు బాధపడ్డారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. గతంలో ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు చాలు కదా అని మాట్లాడిన పెద్దలు ఉన్నారు మళ్లీ ఇవ్వాళ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తి విశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రజల్లో ఉన్న మంత్రులు శాసనసభ్యులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉంటే ఖండించ వలసిన బాధ్యత ముఖ్యమంత్రి కి లేదా అని ఇవాళ భక్తుల ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నారు . హైందవ ధర్మం ప్రశ్నిస్తూ ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతా రాహిత్యంగా మూర్ఖత్వంగా మంత్రులు శాసన సభ్యులు మాట్లాడుతూ ఉంటే వందల సంవత్సరాల నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి మీద ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తూ ఉంటే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఖండించరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఖండించరని విమర్శించారు.

Related Posts