అమరావతి సెప్టెంబరు 25
గాయాకుడు ఎస్పీబీ మృతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని అయన అన్నారు.