YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ సెప్టెంబర్ 25 
కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెబ్యూలు ను విడుదల చేసింది.  బీహార్  శాసనసభలో243 స్థానాలు వున్నాయి. వాటికి  మూడు విడతల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. - మొదటిదశలో 71, రెండోదశలో 94, మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. - అక్టోబర్ 1న మొదటి దశ నోటిఫికేషన్ విడుదల కానుంది. - అక్టోబర్ 28న తొలి విడత,   నవంబర్ 3న రెండో విడత,  నవంబర్ 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. - కరోనా నిబంధనల మేరకు బీహార్లో ఎన్నికలు జరుపుతారు. ఆ రాష్ట్రంలో 7.29 కోట్ల మంది ఓటర్లు వున్నారు. - ఒక్కో పోలింగ్ బూత్లో వెయ్యి మంది ఓటర్లు వున్నారు. ఇక  పోలీంగ్ కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేసారు.  పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు,  పోలింగ్ సిబ్బందికి పీపీ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తారు.

Related Posts