YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సెప్టెంబర్ 25...చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు బ్లాక్ డే

సెప్టెంబర్ 25...చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు బ్లాక్ డే

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 26, 
తన అద్భుత గాత్రంతో భారతీయ పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ఇకలేరని తెలుసుకున్న యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కరోనా వైరస్ బారిన పడి ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన బాలు 50 రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
దీంతో పాటు సెప్టెంబర్ 25వ తేదీన తెలుగు సినీ పరిశ్రమకు అచ్చిరాదని కొందరు గతాన్ని తలుచుకుంటున్నారు. గతేడాది ఇదే రోజున ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో సెప్టెంబర్ 25వ తేదీ టాలీవుడ్‌కు చీకటి రోజు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ కాలేయ వ్యాధిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబర్ 25న మరణించారు.నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్‌ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం(1997) సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తొలిప్రేమ సినిమాతో బ్రేక్ దక్కించుకున్న వేణుమాధవ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ల హీరోల నుంచి యూత్ హీరోల వరకు అందరి సినిమాల్లో ఆయనే కనిపించేవాడు. ‘లక్ష్మి’ సినిమాలో నటనకు గానూ నంది అవార్డు కూడా వరించింది. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాలో నల్లబాబు పాత్రలో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ నవ్వులు తెప్పిస్తుంటుంది. తెలుగు తెరపై ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన ఎస్పీ బాలు, నల్లబాలు(వేణుమాధవ్) ఒకే తేదీన దివికేగడం విషాదకరం.

Related Posts