YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏలియన్స్ అడుగుల బ్లింక్ ...

ఏలియన్స్ అడుగుల బ్లింక్ ...

గ్రహాంతరవాసులు (ఎలియన్స్) ఉన్నాయా, లేదా? అనేది ఇప్పటికి అంతుబట్టని ప్రశ్న. దీనిపై అనేక వాదనలు ఉన్నా.. సరైన రుజువులైతే లేవు. అయితే, తాజాగా గ్రహాంతరవాసులపై చర్చ మొదలైంది. అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) వద్ద గ్రహాంతరవాసుల వాహనాలు (UFO)లు చలనమే ఇందుకు కారణం. వాటి కదలికలు ఐఎస్ఎస్‌ కెమేరాల్లో రికార్డైంది.ఏప్రిల్ 14న రికార్డయిన ఈ వీడియోలో ఓ యూఎఫ్‌వో ఐఎస్ఎస్ వద్దకు వచ్చి లైట్లు బ్లింక్ చేయడం కనిపించింది. దీంతో అది తప్పకుండా గ్రహాంతరవాసులే అని ఓ ఎలియన్ హంటర్ యూట్యూబ్‌లో వీడియో పోస్టు చేశాడు. ‘‘నాసా దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో తెలీదు. ఐఎస్‌ఎస్‌లో ఉండే వ్యోమగాములు కాఫీ బ్రేక్ సమయంలో ఈ యూఎఫ్‌వోలు వచ్చి ఉంటాయి. వాటి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి’’ అని కింగ్‌విల్లే200 అనే యూట్యూబ్ చానెల్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు.ఈ విశ్వంలో మనుషుల్లాగానే వేరే గ్రహాల్లో కూడా జీవులు (ఎలియన్స్) ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ఐఎస్ఎస్ వద్దకు నిత్యం యూఎఫ్‌వోలు వస్తుంటాయని, ఆ విషయం నాసాకు తెలిసినా గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొంటున్నారు. మరి, ఈ వీడియోలో ఐఎస్ఎస్ వద్ద వెలుగులు చిందిస్తున్నవి యూఎఫ్‌వోలా, కాదా అనేది నాసా మాత్రమే స్పష్టం చేయగలవు. 

Related Posts