YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

జిల్లాలో  జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

నెల్లూరు సెప్టెంబ‌రు 26
నెల్లూరు జిల్లాలో  జనసేన పార్టీని  బలోపేతం చేయడమే లక్ష్యంగా  జిల్లా జనసేన  సైనికులు  తన కర్తవ్య నిర్వహణ  నిర్వహించాలని  పార్టీ  అధికార ప్రతినిధి మను క్రాంత్ రెడ్డి పేర్కొన్నారు . స్థానిక పార్టీ కార్యాలయంలో  జనసేన క్రియాశీలక సభ్యుల ఎంపిక ప్రక్రియ  శనివారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్  పిలుపుమేరకు  రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు . ఈ క్రమంలో  నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ పైలెట్ ప్రాజెక్టు  5 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన క్రియాశీలక సభ్యులు నమోదు పక్రియ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో మొట్టమొదటి సభ్యత్వం  క్రియాశీలక సభ్యునిగా చెన్నారెడ్డి మను మను క్రాంత్ రెడ్డి ,సైన్  2 వ  సభ్యత్వం గునుకుల కిషోర్, 3 వ సభ్యత్వం సుజయ్ బాబు తో ప్రారంభించడం జరిగిందన్నారు . క్రియాశీలక సభ్యత్వం  గుర్తించబడిన  నియోజకవర్గాలలో ఇప్పటివరకు  పార్టీ బాధ్యతలను  గురు తిరిగి పని చేసిన వారితో పాటు పార్టీ అజెండా పై నమ్మకంతో పనిచేస్తున్న 500 మందికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ అధినేత పిలుపుమేరకు ఈ కార్యక్రమం రానున్న 10 రోజులలో పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. సభ్యత్వం పొందిన 500 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్త కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా ప్రమాద బీమా కవరేజి ఉంటుంది అన్నారు. రానున్న ఎన్నికల సమయం నాటికి జిల్లాలో జనసేన పార్టీ విజయపథాన ముందుకు సాగేందుకు తగిన ప్రణాళికతో, ఐక్యతతో కలిసి పనిచేయాలని జనసేన సైనికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యకర్తార్యక్రమంలో చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి, గునుకుల కిషోర్, పసుపర్తి కిషోర్,ప్రవీణ్,అనుదీప్, చిరంజీవి యువత కృష్ణా రెడ్డి గారు ప్రశాంత్ గౌడ్ బోనబోయిన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts