YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు

టీడీపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు

టీడీపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు
నెల్లూరు, 
రాష్ట్రంలో సాధార‌ణంగా ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ పార్టీకి చెందిన నేత‌ల‌కు, లేదా.. త‌మ‌కు అనుకూలంగా ఉండే వారికి చిన్నపాటి కాంట్రాక్టులు క‌ట్టబెడ‌తారు. కోట్లలో ఖ‌ర్చయ్యే వాటికి ఎలాగూ టెండ‌ర్లు పిలుస్తారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టే చిన్నపాటి ప‌నుల‌కు మాత్రం త‌మ‌కు న‌చ్చిన వారికి కాంట్రాక్టు ఇచ్చుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే, ఇది ఏ పార్టీ అయినా.. త‌మ పార్టీ నేత‌ల‌కు, అనుకూలంగా ఉండేవారికి ఇవ్వడం ప‌రిపాటి. కానీ, ఇప్పుడు వైసీపీ నేత‌లు.. రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు క‌ట్టబెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.దీనిపై ప‌లు నియోజ‌క‌వర్గాల్లో నాయ‌కులు సైతం నిల‌దీస్తున్నారు. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతోంది? వైసీపీలో కాంట్రాక్టులు చేసే వారు లేరా ? అనే ప్రశ్నలు స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తాయి. అయితే, ఇక్కడే అస‌లు విష‌యం దాగి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య హోరా హోరీ స‌మ‌రం జ‌రిగింది. ఈ క్రమంలో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీగానే చేతి చ‌మురు వ‌దిలించుకున్నారు. నిధుల‌ను మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు పెట్టారు. గెలుపు గుర్రాలు ఎక్కారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి త‌మ‌కు ఏదైనా వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ వారికి ఇప్పటి వ‌ర‌కు నిధులు కూడా స‌క్రమంగా అంద‌డం లేదు.ఈ క్రమంలోనే స్థానికంగా ప‌నులు చేసుకునేందుకు కొన్నాళ్ల కింద‌ట ప్రభుత్వం ప‌చ్చ జెండా ఊపింది. దీంతో వారు ఆయా ప‌నులు ప్రారంభించారు. అయితే, ఈ విష‌యంలో టీడీపీకి చెందిన కాంట్రాక్టుల‌కు ప‌నులు అప్పగించారు. దీనికీ రీజ‌న్ ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టుల‌కు ప‌నులు ఇస్తే.. త‌మ‌కు వ‌చ్చే క‌మీష‌న్లు త‌క్కువ‌గా ఉంటాయ‌ని.. అదే టీడీపీ కి చెందిన వారికైతే.. ఓ పావ‌లా ఎక్కువ‌గా ముట్టచెబుతార‌ని వైసీపీ నాయ‌కులు భావించారు. అదే జ‌రుగుతోంది కూడా. టీడీపీకి చెందిన నాయ‌కులు ఎలాగూ.. మ‌రో నాలుగేళ్లు టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు. సో.. ఓ పావ‌లా ఎక్కువైనా కాంట్రాక్టులు ద‌క్కించుకుందాం. అనే ధోర‌ణిని అవ‌లంబిస్తున్నారు. దీంతో వైసీపీకి చెందిన కాంట్రాక్టులు ల‌బోదిబో మంటున్నారు. ఇదే విష‌యాన్ని నిల‌దీస్తే.. ఎమ్మెల్యేల నుంచి స‌మాధానం కూడా రావ‌డం లేద‌ని స‌మాచారం. ఇదీ సంగ‌తి. ఇక ఎమ్మెల్యేల్లో చాలా మంది యువ‌నేత‌లు, 80 మందికి పైగా కొత్త వారే ఉండ‌డంతో వారు నిర్దాక్షిణ్యంగా పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న వైసీపీ వారిని కాద‌ని.. త‌మ‌కు ఎవ‌రు ఎక్కువ క‌మీష‌న్ ఇస్తే వారికే ప‌నులు ఇస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ కేడ‌ర్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయి

Related Posts