YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు జిల్లాల్లో పార్టీకి కొత్త ఊపిరి

మూడు జిల్లాల్లో పార్టీకి కొత్త ఊపిరి

మూడు జిల్లాల్లో పార్టీకి కొత్త ఊపిరి
విశాఖ‌ప‌ట్ట‌ణం,
అచ్చెన్నాయుడు కింజరాపు కుటుంబ రాజకీయ వారసుడు. ఎర్రన్నాయుడుకు భిన్నమైన మనస్తత్వం ఉన్న నేత. అయినా సరే చంద్రబాబు మెప్పు పొందారు. ఇంకా చెప్పాలంటే ఎర్రన్నాయుడుని కూడా బాబు ఇంతలా చేరదీయలేదు. ఆయన వాక్చాతుర్యంతో, ఇమేజ్ తో తనకు పోటీ వస్తారేమోనని బాబు అలా ఢిల్లీలోనే ఉంచేశారు. కానీ అచ్చెన్నాయుడుని మాత్రం పక్కన ఉంచుకున్నారు. అచ్చెన్న లేకపోతే బాబు రాజకీయం ఎక్కడా పారదు అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ సీన్ ఉంది. మొత్తానికి అచ్చెన్నకు ఏపీ టీడీఎపీ ప్రెసిడెంట్ ఇచ్చినా ఆయన చేయాల్సింది అంతా ఉత్తరాంధ్రాలోనే అని బాబు చెబుతున్నారుట. మూడు జిల్లాల్లో పార్టీకి కొత్త ఊపిరి తీసుకువచ్చేందుకే అచ్చెన్నాయుడికి కిరీటం అన్న మాట.అచ్చెన్నాయుడుకు విజయనగరం, విశాఖపట్నం ఇప్పటికిపుడు దారికి రాకున్నా సొంత జిల్లాలో మాత్రం పట్టు సాధించేందుకు ఈ పదవి ఉపయోగపడుతుందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సహజంగానే టీడీపీకి గట్టి పట్టుంది. లేకపోతే ఒక ఎంపీ సీటు గెలుచుకోవడం చిన్న విషయం కాదు, ఇక వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇక్కడ బాగానే దూకుడు చేసింది కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం వర్గాలు చాలా పెరిగాయి. దాంతో పార్టీ చెల్లాచెదురు అయింది. ఇలా సిక్కోలులో వైసీపీ అయోయమయంలో ఉన్న వేళ అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ సారధి అవుతున్నారు. ఆ పవర్ అంతా ఆయన సొంత జిల్లా మీద చూపించి సైకిల్ ని పరుగులు తీయిస్తారని అంటున్నారు.ఎన్నికల ముందు వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి జగన్ ఎంపీ సీటు ఇవ్వలేదు, టెక్కలి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. ఆమెను జిల్లా ప్రెసిడెంట్ చేశారు. పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తగినట్లుగా కృపారాణి వైసీపీ విజయానికి బాగానే శ్రమించారు. కానీ అధికారంలోకి వచ్చాక క్రుపారాణి కోరుకున్న రాజ్యసభ సీటు రాలేదు. ఆ సంగతి పక్కన పెడితే ఆమెను కనీసంగా కూడా జిల్లా మంత్రులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యేలు ఖాతరు చేయడంలేదు. దాంతో ఆమె కేవలం ఉత్సవ విగ్రహంగా ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి.ఇక కిల్లి కృపారాణి కాళింగ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు, ఆమె వైద్యురాలు, సామాజిక సేవకురాలు కూడా. వైఎస్సార్ ఆమె సేవలను మెచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇక నాడు కాంగ్రెస్ లో ఉన్న ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఆమెను పట్టించుకునేవారు కారు. వర్గ పోరు నాడు కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో ఉండేది. అలా క్రుపారాణి వర్సెస్ ధర్మాన అన్నట్లుగా పొలిటికల్ వార్ జరిగింది. ఇపుడు అదే సీన్ వైసీపీలో కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న క్రిష్ణ దాస్ సైతం జిల్లాలో జరిగే అభివ్రుద్ధి పనులకు సంబంధించి మాట మాత్రంగా కూడా పార్టీ ప్రెసిడెంట్ కి చెప్పడంలేదు. కనీసం పార్టీ సమావేశం ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చాక జరగలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా జిల్లాలో వైసీపీ పోకడ ఉంది. ఇది అచ్చెన్నాయుడుకి అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం జాగ్రత్త పడకపోతే సిక్కోలులో ఫ్యాన్ పార్టీకి అచ్చెన్న చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు

Related Posts