YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వేకెంట్ల్యాండ్ ట్యాక్స్ మ‌రో2 వేల కోట్ల ఆదాయం

వేకెంట్ల్యాండ్ ట్యాక్స్ మ‌రో2 వేల కోట్ల ఆదాయం

వేకెంట్ల్యాండ్ ట్యాక్స్ మ‌రో2 వేల కోట్ల ఆదాయం
హైద్రాబాద్, 
ఎల్ఆర్ఎస్తో ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్ ద్వారా ఇప్పటికే రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్చేసిన సర్కారు.. ఖాళీ స్థలాలన్నీ గుర్తించి ‘వేకెంట్ల్యాండ్ ట్యాక్స్(వీఎల్టీ)’ను పక్కాగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్వసూళ్లనూ పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రేకుల షెడ్ల నుంచి బిల్డింగ్ల దాకా దేన్నీ వదలకుండా ఆస్తులన్నీ ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలనే కొత్త పద్ధతిని తెరపైకి తెచ్చింది. జనంపై పన్నుల బాదుడు ఉండదని సర్కారు పెద్దలు ప్రకటనలు చేస్తున్నా.. ప్రాపర్టీ ట్యాక్స్, వీఎల్టీని కఠినంగా అమలు చేయటం ద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ చేసింది.  స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. మొత్తంగా ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్, వీఎల్టీ  కలిపి జనం నుంచి 12 వేల కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.రికార్డుల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 61 లక్షల ఇండ్లు, భవనాలున్నాయి. పంచాయతీల్లో 49.50 లక్షల ఇండ్లు, మున్సిపాలిటీల్లో 11.5‌0 లక్షల ఇండ్ల నుంచి ఆస్తి పన్ను వసూలవుతోంది. ఇంకా నమోదు కాని ఇండ్లు 10 లక్షలకుపైగా ఉన్నట్టు సర్కారు అంచనా వేసింది. వాటన్నింటినీ భువన్ యాప్ సాయంతో అసెస్  చేయాలని మున్సిపాలిటీలు, పంచాయతీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 15లోపు ఈ పనికి డెడ్ లైన్ పెట్టింది. ఒకట్రెండు రూములు, రేకుల షెడ్లున్న పేదల ఇండ్లనూ వదలకుండా అన్ని ఆస్తుల గుర్తింపు జరగాలని స్పష్టంగా సూచించింది. అన్ని జిల్లాల డీపీవోలు పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్కమిషనర్లు  బిల్ కలెక్టర్లకు జూమ్ ద్వారా జరిగిన వీడియో కాన్ఫరెన్సుల్లో అవగాహన కల్పించారు. అసెస్మెంట్కు, ఓనర్ షిప్కు సంబంధం లేదని.. ఆబాదీ/ గ్రామ కంఠం, సర్వే నంబర్, అటవీ ప్రాంతమైనప్పటికీ ఇండ్లను అసెస్ చేయాలని, అనుమతి లేని నిర్మాణాలకు వెంటనే ఇంటి నంబర్ కేటాయించాలని ఆదేశించారు. ఈ డేటా ప్రకారమే మెరూన్ కలర్ పాస్బుక్స్ను అందజేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.ఖాళీ జాగాలున్న ప్రజల నుంచి నిర్బంధంగా ట్యాక్స్ వసూలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మున్సిపల్ చట్టం–2019లో సర్కారు పలు రూల్స్ చేర్చింది. నిజానికి అంతకన్నా ముందే ఖాళీ ప్లాట్ల ఓనర్లు మార్కెట్వాల్యూలో 0.5% ఏటా ట్యాక్స్గా స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెల్లించాలని… ఇట్లా కట్టిన రిసిప్ట్ ఉంటేనే ఆ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్(జీ/2280/2017) జారీ చేసింది. 2017 ఏప్రిల్ 17 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గతేడాది కొత్తగా తెచ్చిన ‘తెలంగాణ మున్సిపల్ యాక్ట్– 2‌019’ లోని చాప్టర్–3లో ఖాళీల జాగాల గుర్తింపు, ట్యాక్స్ వసూలు రూల్ చేర్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపు నిర్మాణ పర్మిషన్లు ఇవ్వదగిన ఖాళీ జాగాలన్నింటినీ గుర్తించి, ట్యాక్స్ విధించాలని పేర్కొన్నారు. ఇప్పుడీ రూల్ను పక్కాగా అమలు చేసి.. ఒక్క ఖాళీ జాగాను కూడా వదలకుండా ట్యాక్స్ వసూలు చేసేందుకు సర్కారు రెడీ అయింది. ఆయా జాగాల్లో ఇండ్లుగానీ, ఇతర నిర్మాణాలుగానీ చేసేవరకు వీఎల్టీ ట్యాక్స్ కట్టాలి.ట్యాక్సుల వసూలును కట్టుదిట్టం చేసేందుకు సర్కారు రెడీ అయింది. వీఎల్టీ బకాయిలు చెల్లించకపోతే రిజిస్ట్రేషన్లు చేయవద్దని.. ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇవ్వొద్దని మౌఖికంగా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఉన్న రూల్స్ను కూడా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సర్కారు ప్రస్తుతం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ, మెరూన్ పాస్ బుక్స్జారీ ప్రతిపాదన అంతా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను పెంచుకోవడంలో భాగమేనని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి పన్ను పరిధిలోకి రాని ఇండ్లను అసెస్ చేయడం, ఖాళీ స్థలాలను గుర్తించి అసెస్మెంట్ నంబర్ ఇవ్వడం వంటివి చేపట్టారని అంటున్నారు. అంతేకాదు ఖాళీ జాగాల ఓనర్లు ఎక్కడున్నా సరే వారి నుంచి పక్కాగా పన్ను వసూలు చేసేందుకు మెకానిజంను రూపొందిస్తున్నట్టు తెలిసిందిమున్సిపాలిటీల్లో ఆస్తులను పక్కాగా అసెస్‌ చేసి, ట్యాక్సులను పూర్తి స్థాయిలో వసూలు చేస్తే మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) ఎక్స్పర్టుల టీమ్ గతంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కు ఇచ్చిన రిపోర్టులో సూచించింది. మున్సిపల్ ఫైనాన్స్, సర్వీస్ డెలివరీపై రెండేళ్ల కిందట స్టడీ చేసి పలు సూచనలు చేసింది. ట్యాక్సుల ఇన్కం పెంచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అసెస్డ్‌, అన్‌ అసెస్డ్‌ ప్రాపర్టీలను గుర్తించి డేటా రూపొందించాలని, అసెస్‌ చేయని ఆస్తులను అసెస్‌ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ విధించాలని.. ఖాళీ జాగాలు, కేబుల్‌ ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు చేయాలని పేర్కొంది. ఆస్కీ రిపోర్టులోని సూచనలకు సర్కారు మరింత పదును పెట్టి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
 

Related Posts