YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఎస్వీబీసీ నూతన భవనం ప్రారంభం

ఎస్వీబీసీ నూతన భవనం ప్రారంభం

ఎస్వీబీసీ నూతన భవనం ప్రారంభం
తిరుపతి  
ఎస్వీ బిసి నూతన కార్యాలయం ప్రారంభం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన భవనాన్ని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి, డిప్యూటి సిఎం  నారాయణ స్వామి తో కలసి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా  వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సనాతన హిందూ ధర్మాన్ని,. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలనే లక్ష్యం తో టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ను ప్రారంభించింది.  2007 లో అప్పటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుమతితో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయని అన్నారు.
 ఈ ప్రయత్నం ఫలించి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో 2008 ఏప్రిల్ 7 న ఉగాది రోజు టెస్ట్ సిగ్నల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.  . మూడు నెలల తరువాత జులై 7 న పూర్తి స్థాయి ప్రసారాలు ప్రారంభించింది.   భక్తి చానళ్ల లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎస్వీ బిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది.  చానల్ ప్రారంభించిన తక్కువ కాలం లోనే తిరుపతి నుంచే శాటిలైట్ కు అప్ లింక్ చేసే ఏర్పాటు చేసుకుంది. హిందూ ధర్మ ప్రచారంలో మరో ముందడుగు వేయాలనే ఉద్దేశంతో 2017 ఏప్రిల్ 14వ తేదీ తమిళ చానల్ ప్రారంభించిందని అన్నారు. 
 ఎస్వీ బిసి భవిష్యత్ అవసరాల కోసం 20. 45 కోట్లతో టీటీడీ కొత్తభవనాలు నిర్మించింది.   ఈ భవనాలను ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అధికారులు, సిబ్బందికి నా శుభాకాంక్షలు.  కొత్త భవనాల్లో 2 స్టూడియోలు, టెలీ పోర్ట్ తో పాటు సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక మీదట అన్ని విభాగాలు ఇక్కడ నుంచే పని చేస్తాయి.  భక్తుల కోరిక మేరకు ఎస్వీ బిసి ని యాడ్ ఫ్రీ చానల్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం.  ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి ఎస్వీ బిసి ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఈ ట్రస్ట్ కు ఇప్పటి దాకా దాదాపు 4 కోట్ల విరాళాలు అందాయని వెల్లడించారు.
 భక్తుల కోరిక మేరకు హింది, కన్నడ చానళ్లు కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం.  ప్రసారాల నాణ్యతను మరింత పెంచడానికి ఎస్వీ బిసి ని హెచ్ డి చానల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము.   కోవిడ్ 19 నుంచి ప్రపంచం లోని ప్రజలందరినీ కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ప్రారంభించిన వేద పారాయణం, సుందర కాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణం కార్యక్రమాల లైవ్ ప్రసారాల ద్వారా ఎస్వీబిసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు మరింత దగ్గరైందని అన్నారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కర్ణాటక సీఎం శ్రీ ఎడియూరప్ప గారు సుందర కాండ పారాయణం లో పాల్గొని పారాయణం చేశారు.   కోవిడ్ 19 నిబంధనల వల్ల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిచాము. వీటిని కూడా ఎస్వీ బిసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మంది భక్తులకు చూపించింది. - త్వరలో ఇంగ్లీష్,హిందీ ప్రసారాలు ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈ ఓ  ధర్మారెడ్డి, జెఈఓ  బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి, ఎస్వీ బిసి సి ఈ ఓ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Related Posts