YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు భరోసా కేంద్రాల దగ్గర గోడౌనులు

రైతు భరోసా కేంద్రాల దగ్గర గోడౌనులు

రైతు భరోసా కేంద్రాల దగ్గర గోడౌనులు
కాకినాడ 

రాష్ట్రంలో త్వరలో రైతు భరోసా కేంద్రాల వద్ద గోడౌన్ లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పరిమళ ఫంక్షన్ హాల్ లో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవ డానికి ప్రత్యేకమైన చర్యలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాల వద్ద త్వరలో గోడౌన్ లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రైతాంగానికిమేలు చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వ్యవసాయదారునితో పాటు కౌలు రైతులకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. రైతులకు పంట రుణాలు, కనీస మద్దతు ధర, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, తదితర అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జగ్గంపేటలో త్వరలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, దీనికి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు  స్థల సేకరణ చేయాలని తెలిపారు. అలాగే కిర్లంపూడిలో ఉన్న సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధిలోకి తెస్తామని మంత్రి తెలిపారు. వైఎస్సార్ జలసిరి ద్వారా ఉచితంగా బోర్లను వేయడానికి సోమవారం ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.మహిళలను అన్నివిధాలా అభివృద్ధిలోకి తీసుకురావడానికి 50 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించామని, అలాగే ఎస్సి, ఎస్టీ, బిసిలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.

Related Posts