దేశ ప్రజలను నగదు సమస్య వెంటాడుతుంది. ఎక్కడా చూసిన ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక వేళ నగదు పెట్టినా క్షణాల వ్యవధిలోనే అయిపోతుంది. సరిపడనంతా డబ్బును ఏటీఎంలలో జమ చేయడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉన్న ప్రజలు నగదు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో.. ఏటీఎంలలో సరిపడ నగదు లేకపోవడంతో.. సామాన్య ప్రజానీకం పడరాని కష్టాలు పడుతున్నారు. కనీసం ఒక పది వేల రూపాయాలు డ్రా చేసుకుందామన్న ఆ పరిస్థితి లేదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. అప్పటి కంటే పరిస్థితి ఇప్పడు దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఏటీఎంలలో కేవలం రెండు వేల రూపాయాల నోట్లు ఉండటంతో చిల్లర సమస్య ఉత్పన్నమవుతుంది. నోట్ల రద్దు నాటి నుంచి నగదు విషయంలో సమస్యలు తలెత్తుతున్న విషయం విదితమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు లేని పరిస్థితి ఉందన్నారు. డబ్బు కోసం 10 నుంచి 15 ఏటీఎంలను చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏటీఎంలలో సరిపడ నగదు పెట్టాలని బ్యాంకు అధికారులను ప్రజలు కోరుతున్నారు. నగదు లేక ఏటీఎంలు బోసిపోతుంటే, నో క్యాష్ బోర్డులకు ఒకటి, రెండు రోజుల్లో చెక్ పడనుంది. నగదు లభ్యతను పరిశీలించేందుకు ఆర్ బీఐ ఈ రోజు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆర్థిక శాఖకు ఆర్ బీఐ పంపిన సమాచారం మేరకు ఏపీ, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదు కంటే ఉపసంహరణలు ఎక్కువ అయ్యాయి. శవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు నిండుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజర్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఇబ్బంది అధికంగా ఉండగా, మరో మూడు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించింది. బ్యాంకులకు వచ్చే డిపాజిట్లతో పోలిస్తే, ఏటీఎంల నుంచి విత్ డ్రాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని బ్యాంకులు చెబుతున్నాయి అసలు నగదుకు కొరత లేదని ఆయన తేల్చేశారు. నగదుకు కొరతపై పెద్ద ఎత్తున వార్తలు వస్తుండడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగదు పరిస్థితులను తాను సమీక్షించినట్టు చెప్పారు. ‘‘దేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం జరిగింది’’ అని జైట్లీ ట్వీట్ చేశారు. మ.నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని, ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు.బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య ఉన్నమాట వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ ఉందన్నారు. పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందన్నారు. దీంతో ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు. అన్ని ఏటీఎంలలో క్యాష్‌ను ఉంచేలా చర్యలను తీసుకుంటామన్నారు. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా నగదు కోసం డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. గత 13 రోజుల్లో సుమారు 45000 కోట్లు సరఫరా చేశామని ప్రభుత్వం తెలిపింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఎంపీ, బీహార్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందన్నారు.
కేటీఆర్, లోకేష్ కౌంటర్
జైట్లీ ట్వీట్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు ... ‘సర్, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదు, ఈ విషయంపై మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి.. బ్యాంకింగ్ వ్యవస్థపై క్రమంగా నమ్మకాన్ని వమ్ము చేస్తోన్న ఈ సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతైన పరిశీలన జరపాలి’ అంటూ ట్వీట్ చేశారు. నగదు కొరతపై ఏఎన్ఐ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్ అరుణ్ జైట్లీ చెప్పిన దానికి ఇది ఉదాహరణ అంటూ కామెంట్ చేశారు.