మరో ఆలయంపై దాడి..నంది విగ్రహం ధ్వంసం
చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు హిందూ దేవాలయాల్లో మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దాంతో ఏపిలో రాజకీయం వేడెక్కింది. తాజాగా ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక్షవర్గంలో ఆగరమంగలంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు. ఆలయం వెనక భాగం నుంచి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు నందిని పెకలించి ఆలయం వెనక్కి తీసుకెళ్లి పగలగొట్టారు. విగ్రహన్ని వివిధ భాగాలుగా పగలగొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని, ఇందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.