YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైయస్సార్ జలకళను ప్రారంభించిన సీఎం జగన్

వైయస్సార్ జలకళను ప్రారంభించిన సీఎం జగన్

వైయస్సార్ జలకళను ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి 
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైయస్ఆర్ జలకళ పేరుతో పొలాల్లో బోర్లు వేసే పథకం ప్రవేశపెట్టింది. దీని కోసం 2,340 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఉచితంగా బోర్లు వేసి.. పొలాలకు సాగునీరు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ పధకం ద్వారా  రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. . ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Related Posts