YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మారుతున్న మ‌రాఠ రాజ‌కీయాలు

మారుతున్న మ‌రాఠ రాజ‌కీయాలు

ముంబై, సెప్టెంబ‌ర్ 29, 
మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ వ్యవహార శైలినీ, కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరునూ గమనిస్తున్న వారికి ఏమంత ఆశ్చర్యం కలిగించవు. పైగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఒక్క కాంగ్రెస్సే కాదనీ, బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీ, ప్రతి పక్షమూ అని సులభంగా అర్ధమైపోతుంది.  మోడీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఇచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ పిలుపునకు అర్ధం ఏమిటన్నది ఇప్పుడిప్పుడే అందరికీ అవగతమౌతున్నది. ఆ పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం...ఏక పార్టీ వ్యవస్థ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ కమలం ప్రభుత్వాలే కొలువుదీరాలన్నదేనని మెల్లిమెల్లిగా బీజేపీ మిత్ర పక్షాలకు కూడా అర్ధమౌతున్నది.తోకపార్టీగా కాకుండా సమాన భాగస్వామ్య పక్షంగా ఉండాలనుకునే ఏ పార్టీనీ బీజేపీ సహిందనడానికి మహారాష్ట్రలో మోడీ2.0 హయాం నుంచీ వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనించే వారికి సులభంగానే అర్ధమౌతుంది. మోడీ ముక్త కాంగ్రెస్ పిలుపును ఇచ్చే నాటికి దేశంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టగలిగేందుకు అవసరమైన స్థానాలను లోక్ సభలో కలిగి ఉంది. అయితే ఎన్నికలకు ముందు అటువంటి ధీమాకానీ, విశ్వాసం కానీ కమల నాథులకు లేదు. అందుకే మిత్ర పక్షాలను కలుపుకునే 2014 ఎన్నికలకు వెళ్లింది. తీరా ఎన్నకల ఫలితాల తరువాత...ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మొట్టమొదటి సారిగా...విశ్వసనీయ మిత్రపక్షాలకు సైతం వారు ఎక్కడ ఉండాలో చెప్పింది.అలా చెప్పడానికే అత్యంత ఉద్వేగ భరితమైన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఎత్తుకుంది. ఆ నినాదాన్ని మోడీ తనకు మాత్రమే సాధ్యమేన విధంగా...కాంగ్రెస్ వ్యతిరేకతను దేశ భక్తినీ ముడిపెట్టి ఎత్తుకున్నారు. అంతే కాదు మూడున్నర దశాబ్దాలుగా ఎన్డీయేలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన శివసేన పార్టీని  తెగ తెంపులు చేసుకోవడానికి ఒక నిముషం కూడా ఆలోచించలేదు. అయితే అనూహ్యంగా మహారాష్ట్రలో మహాఘట్ బంధన్ కు నాయకత్వం వహిస్తూ శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తూ మహా సంకీర్ణాన్ని కూలదోయడానికి చేయని ప్రయత్నం లేదు.శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి ఉద్దవ్ థాక్రే సీఎం కాకుండా అడ్డుకోవడానికి  చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కమలం పార్టీ అనివార్యంగా విపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అయితే తాజాగా మళ్లీ థాక్రే ప్రభుత్వ మనుగడకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చి పడ్డాయంటే వెనకుండి చక్రం తిప్పింది కమలమేననడంలో సందేహం లేదు.  ఇందుకు తిరుగులేని సాక్ష్యం...శివసేనలో కీలక నేత, ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ రౌత్ లో బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మంతనాలు జరపడమే.  ఇది జరిగిన రోజుల వ్యవధిలోనూ ఫడ్నవీస్...ఎవరి ప్రమేయం లేకుండానే థాక్రే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పడం...సంజయ్ రౌత్ తో తన మంతనాల వెనుక ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేశారు. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఉటంకించడమే వెనుక ఏదో జరుగుతోందని ఉప్పందిచడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts