YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రివర్స్ గేర్ లో టీడీపీ

 రివర్స్ గేర్ లో టీడీపీ

విజ‌య‌వాడ‌‌, సెప్టెంబ‌ర్ 29, 
చంద్రబాబు రాజకీయం గురించి ఇపుడు ఎవరూ పెద్దగా ఆలోచించడంలేదు. తమ్ముళ్ళు కూడా టీడీపీ ఉంటుందా లేదా అని తల్లడిల్లుతున్నారు. దీనికి నూటికి నూరు శాతం చంద్రబాబే కారణం. ఆయన అవకాశవాద రాజకీయాలే అసలు కారణం. షార్ట్ రూట్ పాలిటిక్స్ కి చంద్రబాబు అలవాటు పడి బంగారు లాంటి టీడీపీ భవిష్యత్తు నాశనం చేశారని సీనియర్లు మధనపడతారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు ఇంకా రొటీన్ పాలిటిక్స్ నే నమ్ముకుంటున్నారు. ఓవైపు దేశ రాజకీయం మారుతోంది. బాబు ఉంటున్న తెలంగాణాలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ కొత్త రూట్లో పాలిటిక్స్ చేస్తోంది. దాన్ని చూసి అయినా చంద్రబాబు మారితే ఆయనకూ టీడీపీకి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు.చంద్రబాబుకు రాజకీయ చాణక్యుడు అని ఎందుకు పేరు వచ్చిందో కానీ ఆయన తీరు ఇపుడు చూసిన వారు మాత్రం ఇదేమి రాజకీయమని ఆశ్చర్యపోతారు. కోయిల ముందే కూసినట్లుగా 2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీకి రాం రాం అనేశారు. మోడీ మీద యుద్ధం ప్రకటించారు. నాడు మోడీ మీద మరీ వ్యతిరేకత లేదు, అయినా చంద్రబాబు ఊరూరా తిరిగి బీజేపీని బంగాళాఖాతంలో పడవేస్తానని గట్టిగా నినదించారు. కానీ చంద్రబాబు ఆనాడు చేసినది రాంగ్ టైంలో. ఇపుడు కరెక్ట్ టైం వచ్చింది. మోడీ మీద జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కత్తి కట్టాయి. కానీ చంద్రబాబు ఇపుడు చూస్తే రివర్స్ గేర్ లో వెళ్తున్నారు అన్నదే తమ్ముళ్ళ ఆవేదన.సరిగ్గా ఇపుడు చంద్రబాబు వంటి సీనియర్ నేత ఢిల్లీ వెళ్ళి గర్జిస్తే ఆ సౌండే వేరుగా ఉంటుంది. మోడీ గ్లామర్ ఇపుడు బాగా పడిపోయింది. మోడీకి వెన్నుదన్ను అనుకున్న సోషల్ మీడియావే ఆయనకు పూర్తి యాంటీ అయింది. అక్కడ మోడీ మీద ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంది. ఇక బీజేపీ అనుసరిస్తున్న విధానాలు చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారే బాధపడుతున్నారని ప్రచారం అయితే ఉంది. వ్యవసాయ బిల్లుల విషయంలో వెంకయ్యనాయుడికి ఇష్టం లేకనే ఆయన తప్పుకుని డిప్యూటీ చైర్మన్ కి రాజ్యసభను వదిలేశారని అంటున్నారు. ఇక కరోనా తరువాత దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోంది. బీజేపీకి ఓటేసి తప్పుచేశామనుకున్న వారు నానాటికీ పెరుగుతున్నారు.ఇటువంటి టైంలో చంద్రబాబు కనుక ముందుకు వచ్చి దేశ ఆర్ధిక, వ్యవసాయ విధానాల మీద మోడీని నిలదీస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇక ఏపీలో బీజేపీకి గుళ్ళూ గోపురాలు తప్ప మరేమీ రాజకీయం లేదు. ఒక్క ప్రజా సమస్య పట్ల వారికి ఆలోచన లేదు, మూడు రాజధానుల విషయంలో బీజేపీ అయోమయానికి జనమే అగ్రహిస్తున్నారు. జగన్ బీజేపీ కొంగు విడవకుండా పట్టుకు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుతో సీఎం అయిపోతానని భ్రమల్లో ఉన్నారు. ఇలా ఏపీ పొలిటికల్ సీన్ ఉంది. బీజేపీకి ఓ వైపు జగన్ మరో వైపు పవన్ ఉంటే చంద్రబాబు ఎందుకు గుర్తుకువస్తారు. బాబు అవసరం ఏముంది.అందువల్ల బీజేపీతో పొత్తులు అన్న మాట వదిలేసి ఢీ కొట్టేందుకే చంద్రబాబు రెడీ అయితే అది ఆయనకూ, టీడీపీకి కూడా మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. అంటే ఓ విధంగా రెండవ వైపు పొలిటికల్ గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. అందువల్ల బాబు బీజేపీ మద్దతు అంటూ గుంపులో గోవిందా కాకుండా బయటకు వస్తే యాంటీ బీజేపీ సెక్షన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద మండిపోతున్న జనాలు చంద్రబాబుకు గట్టిగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం మోడీని పల్లెత్తు మాట అనకుండా మళ్ళీ రాంగ్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదే తీరులో ఉంటే 2024లో కూడా టీడీపీకి చేదు అనుభవాలు తప్పవని అంటున్నారు.

Related Posts