YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

8 వేల కోట్లఎక్సైజ్ శాఖకు కాసుల పంట

 8 వేల కోట్లఎక్సైజ్ శాఖకు కాసుల పంట

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 29, 
తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండుతోంది. మద్యం బాబులు కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. నాలుగు నెలలు (మే, జూన్, జులై, ఆగస్టు) కాలంలో ఎక్సైజ్ శాఖకు ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు.అంటే దాదాపు రూ.8 వేల కోట్ల మద్యాన్ని తాగేసి..ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండిస్తున్నారు. ఇదంతా జలగం సుధీర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన అధికారిక సమాధానం.2017–18లో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఎక్సైజ్‌ ఆదాయంలో వృద్ధి కనిపించింది.ఈ సంవత్సరం మార్చి వరకు మద్యం విక్రయాలు బాగానే జరిగాయి. కానీ..కరోనా వైరస్ కారణంగా..లాక్ డౌన్ విధించడం..కఠిన నిబంధనలు పాటించాల్సి రావడంతో..మద్యం షాపులకు తాళాలు పడ్డాయి. దీంతో మద్యం విక్రయాలు జరగలేదు.
అన్ లాక్ లో భాగంగా..మద్యం షాపులకు, బార్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. డబ్బులు లేకుండా ఉన్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కాసులతో గలగలలాడుతోంది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చే సరకి ఎక్సైజ్‌ ఆదాయం రూ.20 వేల కోట్లు దాటుతుందని అంచనా.మరోవైపు 2014–15 నుంచి రాష్ట్రంలో మద్యం తాగి ఎవరూ చనిపోలేదని ఈ శాఖ సమాధానంలో తెలిపింది. ఏ జిల్లాలోనూ ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో మాత్రమే మద్యం నాణ్యతా పరీక్షల కోసం ప్రయోగశాలలున్నాయని, వీటి ద్వారా వచ్చిన అనుమతుల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు మద్యం సరఫరా చేస్తామని తెలిపింది. మద్యాన్ని తెగ తాగేస్తూ…రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నారు.

Related Posts