YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎస్సీ ఎస్టీ బిసి పేదల సంక్షేమాన్నిమరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్

ఎస్సీ ఎస్టీ బిసి పేదల సంక్షేమాన్నిమరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్

 భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్ 29 
ఎస్సీ ఎస్టీ బిసి భూముల  పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న టువంటి రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చౌక్ చేపట్టారు.ఈ రిలే నిరాహార దీక్షలు 29వ రోజు సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండలం సీనియర్ నాయకులు ఇనగాలి మొగిలి (కరాటే మాస్టర్). నేతృత్వంలో దీక్షలో పాల్గొన్నారు .  దీక్షా శిబిరాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్ మాదిగ, చెంగల గురునాథ మాదిగ, నల్లగట్ల వెంకన్న మాదిగ, ప్రారంభించారు.అనంతరం ఎమ్మార్పీ జిల్లా ఇంచార్జ్ ఎస్.కె మదర్ సాహెబ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిసి పేద ప్రజల సంక్షేమాన్ని మరిచి పాలన సాగిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో వివక్ష చూపిస్తున్నాడని, ఎస్సీ ఎస్టీ బిసి పేద ప్రజలను అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి అగ్రకులాలకు రాష్ట్రాలు పెద్ద పీట వేస్తూ పాలన సాగిస్తున్నాడు అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేదల భూములను బలవంతంగా గుంజు జుకోవడం దారుణమని,వందల ఎకరాల భూస్వాము లను ప్రోత్సహించేందుకు రైతు బంధు పథకం సబ్సిడీలు ఇతర అనేక సంక్షేమ పథకాలు నేరుగా వారికి అందేలా రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం దారుణమని వాపోయారు. తెలంగాణలో అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రతి పేద కుటుంబానికి ఎందుకు భూమి సొంతింటి కల నెరవేరాలని చెప్పి మాట మార్చడం కెసిఆర్ కి చెల్లిద్దని అన్నారు. కెసిఆర్ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బిసి పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రతి గ్రామంలో లో ఎస్ ఎస్ సి బి సి పేద ప్రజల కోసం మూడు ఎకరాల భూ పంపిణీ, డబల్ బెడ్రూమ్ ఇల్లు, సొంతింటి నిర్మాణం చేపట్టాలని, అసైన్మెంట్ భూముల కు పాస్ పుస్తకాలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష శిబిరంలో పోగుల రవీందర్ మాదిగ, దాసరి సాంబయ్య మాదిగ, దాసరి శ్రీనివాస్ మాదిగ, దాసరి మనోజ్ మాదిగ, దాసరి చక్రదర్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ, చదలవాడ ప్రకాష్ మాదిగ, దాసరి సారథి మాదిగ, రమాదేవి మాదిగ, తదితరులు కూర్చున్నారు. సంఘీభావం తెలిపిన వాళ్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా , భారతీయ దళిత సాహితి అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమారి, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి సమిమ, కాకటీ బాబు తదితరులు  పాల్గొన్నారు.

Related Posts