YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

ములాయం పార్టీతో అసద్ పొత్తు

ములాయం పార్టీతో అసద్ పొత్తు

హైద్రాబాద్, సెప్టెంబర్ 29
బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం పార్టీ బ‌రిలోకి దిగ‌నున్న‌ది.  దేవేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్‌కు చెందిన స‌మాజ్‌వాదీ జ‌న‌తాద‌ళ్ డెమోక్ర‌టిక్ పార్టీతో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డిన‌ట్లు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్  ఓవైసీ పేర్కొన్నారు.  సీఎం నితీశ్ కుమార్ పాల‌న వ‌ల్ల బీహార్ ప్ర‌జ‌లు అల‌సిపోయార‌ని, కొత్త ఆప్ష‌న్ కావాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న‌ట్లు ఓవైసీ వెల్ల‌డించారు.  బీహార్ ప్ర‌జ‌ల‌కు తాము  మంచి ఆప్ష‌న్ ఇవ్వ‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  అక్టోబ‌ర్ 28, న‌వంబ‌ర్ 3, 7 తేదీల్లో మొత్తం  మూడు ద‌శ‌ల్లో బీహార్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  బీహార్ ఎన్నిక‌ల్లో బీజేపీ, జేడీయూలు కూట‌మిగా పోటీ చేయ‌నున్నాయి.  ఇక ఆ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ.. బీఎస్పీ, జ‌న్‌వాదీ  సోష‌లిస్టు పార్టీల‌తో ఎన్నిక‌ల స‌మ‌రంలోకి  దిగుతున్నాయి.

Related Posts