ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఇలియానా.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించిన రైడ్ చిత్రంలో కథానాయికగా నటించింది ఇల్లీ బేబి. ఇటీవలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. అయితే ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌కి సంబంధించి తరచు వార్తలలో నిలుస్తుంది. ఆస్ట్రేలియాకి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ని ఇలియానా సీక్రెట్ వివాహం చేసుకుందని ఆ మధ్య పలు వార్తలు రాగా, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఇలియానా తల్లి కాబోతుందంటూ మరో రూమర్ స్ప్రెడ్ అయింది. అందుకు కారణం ఈ మధ్య ఇలియానా ఎక్కువగా లూజు దుస్తులు ధరించడమేనంటున్నారు. ఇలియానా రైడ్ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకి వచ్చినప్పుడు తన గర్భం ఎవరికి కనిపించకుండా లూజు బట్టలు వేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదీకాక ఇలియానా ప్రియుడు ఆండ్రూ నీబోన్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. బాత్ టబ్‌లో కాఫీ తాగుతూ సేదతీరుతున్నట్టుగా ఉన్న ఇల్లీ ఫోటోని షేర్ చేస్తూ.. ఇలియానా సింగిల్ లైఫ్ సరదాగా గడుపుతుందని కామెంట్ పెట్టాడు. దీంతో అందరిలో పలు అనుమానాలు నెలకొన్నాయి. మరి ఇలియానా దీనిపై ఏమైన స్పందిస్తుందేమో చూడాలి.