YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సిటీలో సుపారీ గ్యాంగ్ లు

సిటీలో సుపారీ గ్యాంగ్ లు

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 30, 
ఒకప్పుడు సుపారీ గ్యాంగులు అంటే ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పిలుచుకుని వచ్చే వారు. ఇలాంటి విషయాలను పోలీసులు వెల్లడిస్తూ ఉంటే అందరూ షాక్ అయ్యే వాళ్లు. ఇలాంటి ఘటనల ఆధారంగానే మనోళ్లు సినిమాలు కూడా తీస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ సుపారీ గ్యాంగ్ ల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదట.. హైదరాబాద్ లోనే ఈ గ్యాంగ్ లు విచ్చల విడిగా పుట్టుకొస్తూ ఉన్నాయి. సుపారీ గ్యాంగ్ లు ఏకంగా ఆన్ లైన్ లో అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చే రేంజికి ఎదిగిపోయాయంటే క్రైం  ఏ స్థాయిలో పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. మనిషిని చూపించి వారు చెప్పిన డీల్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చేస్తే చాలు.. ఏమైనా చేయడానికి రెడీ అయిపోతాయి.. ఈ సుపారీ గ్యాంగ్ లు..! డబ్బులు తమ చేతికి ఇస్తే చాలు.. జస్ట్ వ్యక్తికి సంబంధించిన డీటైల్స్, ఉండే ప్రాంతానికి సంబంధించిన సమాచారం వారికి ఇచ్చేస్తే పని చేయడానికి వెనుకాడరు. కావాలంటే క్రైమ్ చేశాక జైలులో ఉండడానికి కూడా వెనుకాడని మనస్తత్వం వారిది. హైదరాబాద్ లో సుపారీ గ్యాంగ్ లు ఇటీవలి కాలంలో విచ్చల విడిగా పుట్టుకొచ్చాయి. ఓ వ్యక్తిని చంపాలంటే లక్షల నుండి కోట్లలో డీల్స్ జరుగుతూ ఉన్నాయి. తమ దగ్గర ఈ క్రైమ్ చేయడానికి కావాల్సిన మనుషులు ఉన్నారంటూ అభయం ఇస్తూ ఉంటారు ఈ సుపారీ గ్యాంగ్ సభ్యులు. ముఠాలోని ఓ సభ్యుడు దొరికినా ఇంకొకడు ఆ పని చేస్తూ ఉంటాడు. మర్డర్ చేసే వాళ్లు బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వస్తూ ఉన్నారని.. ఇక్కడ ఉన్న రౌడీలు వారితో చేతులు కలిపి చేయాల్సిన పనులు చేసేస్తూ ఉంటారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని సుపారీ గ్యాంగ్ లు లోకల్ రౌడీలు చేతులు కలిపి ఈ క్రైమ్ దందాను ఏలుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ లో భాగంగా సుపారీ గ్యాంగుల మీద పోలీసులు కూడా దృష్టి పెట్టారు. ఏ క్రైమ్ ను తోడినా సుపారీ గ్యాంగు హస్తం బయటపడుతూ ఉండడంతో వీరిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.  

Related Posts