YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బాబ్రి మసీదు ద్వంసం కేసులో కోర్టు సంచలన తీర్పు నిందితులందరూ నిర్దోషులే…

బాబ్రి మసీదు ద్వంసం కేసులో కోర్టు సంచలన తీర్పు నిందితులందరూ నిర్దోషులే…

లక్నో సెప్టెంబ‌ర్ 30,
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నాడు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ప్రాసిక్యూషన్ పేర్కొన్న వారందరినీ నిర్దోషులుగా నిర్ణయిస్తూ తుది తీర్పు వెలువరించింది. అయోధ్య ఘటన ఆకస్మికంగా జరిగిందే.. . పధకం ప్రకారం జరిగిందనడానికి ఆధారాల్లేవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కోన్నారు.  ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, రామ్ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, సంఘ్ పరివార్ నేతలు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది.
తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం  ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఉన్నారు. వారిలో విచారణ సమయంలో 17 మంది మృతి చెందారు. 21 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషితో ఆపటు యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్ కటియార్, పవన్ పాండే, సుధీర్ కక్కర్ వంటి వారు కూడా ఉన్నారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును  కరసేవకులు కూల్చివేశారు.  1993 ఆగష్టు 27 వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన కేసును సీబీఐకు అప్పగించారు. 2001 లో సీబీఐ కోర్టు కొంతమంది ప్రముఖుల పేర్లను తొలగించగా, 2017లో సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, వారి పేర్లను కూడా చేర్చాలని, కేసును రెండేళ్లలో పూర్తి చేయాలనీ ఆదేశించింది.  అప్పటి నుంచి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కేసును వేగవంతం చేసింది. అంతుకుముందు 2009లో నివేదిక లిబర్హన్ కమిషన్ సమర్పించారు. మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉన్నట్లు కమిషన్ తేల్చింది. వెయ్యి మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 28 ఏళ్ల విచారణానంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పును వెలువరించారు.

Related Posts