న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30
మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లతో పాటు కరీష్మా ప్రకాశ్‌లను గత వారం ఎన్సీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో నలుగురు చెప్పిన స్టేట్‌మెంట్స్‌ని రికార్డ్ చేశారు. అయితే దీపికాతో పాటు ఆమె మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌ల స్టేట్‌మెంట్.. ఎన్సీబీ అధికారులకు సంతృప్తిని ఇవ్వడంతో త్వరలోనే వారికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి.కొద్ది సేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పుకార్లపై స్పందిస్తూ.. ఎన్సీబీ విచారించిన నలుగురు హీరోయిన్స్‌కు క్లీన్ చీట్ ఇస్తుందని వచ్చిన వార్తలు అర్ధం లేనివి. అందులో వాస్తవం లేదు అని పేర్కొన్నారు. 2017లో జరిగిన వాట్సాప్ చాట్‌లో పలు కోడ్స్‌తో జరిగిన చాటింగ్‌పై దృష్టి పెట్టిన ఎన్సీబీ దీపికా, సారా, రకుల్, శ్రద్ధా, కరిష్మా ప్రకాశ్‌లను పలు కోణాలలో విచారిస్తుంది.