YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చెల‌రేగిపోతున్న క‌మ‌ల నాధులు

చెల‌రేగిపోతున్న క‌మ‌ల నాధులు

విజ‌య‌వాడ‌ అక్టోబ‌రు 1, 
ఏడారిలో నీళ్లు దొరకవు. కానీ బీజేపీ మాత్రం అక్కడ నదులనే పారించగలదు, అడవిలో అర్ధరాత్రి అన్నం పుట్టించి పంచభక్ష్యాదులతో విందులు చేయగల సత్తా కూడా బీజేపీ సొంతం. అందుకే కదా ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కమలం పూవులను పూయించింది. ఆ వరసలోనే కదా కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ ని సైతం బద్ధలు కొట్టి మమతా బెనర్జీతో ఢీ కొడుతోంది. ఇన్ని చేసిన బీజేపీకి ఏపీ చేత కాషాయం కట్టించడం అసాధ్యమని ఎవరైనా అనుకుంటారా. కాకపోతే ఇన్నాళ్ళూ బీజేపీ ఆ దిశగా ఆలోచించలేదు. అంతే కాదు, సరైన నాయకత్వానికి ఏపీ బాధ్యతలు అప్పగించలేదు. ఇపుడు అగ్నికి వాయువు తోడు అయ్యాయి.ఏపీలో ఇపుడు వరసగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదివరకు చంద్రబాబు హయాంలో కూడా ఆలయాలు నేలమట్టం అయ్యాయి. కానీ అపుడు బీజేపీ మిత్ర పక్షం. పైగా లోకల్ లీడర్ షిప్ బాబుతో కలసి మెలసి ఉంది. అందువల్ల ఏదీ పెద్దగా ఫోకస్ కాలేదు, ఇపుడు మాత్రం ప్రతీదీ క్షణాల్లో బయటకు వచ్చి భారీ ఎత్తున ప్రచారానికి నోచుకుంటోంది. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటి అంటే బీజేపీ రాజకీయానికి ఇంధనం బాగా దొరుకుతోందని, ఇంతలా సానుకూలత ఉంటే కమలం హుషార్ చేయకుండా ఉంటుందా.ఇక త్రిపురలో కరడు కట్టిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వారి నుంచి బీజేపీ అధికారం తీసుకోవడం అంటే సూర్యున్ని పడమర నుంచి ఉదయించేలా చేయడమే. కానీ బీజేపీ అంత పనీ చేసింది. హిందూ మతమే కాదు, అసలు దేవుడే లేడనే నాస్తికత్వం వామ‌పక్ష ప్రభుత్వానిది. దాంతో బీజేపీ పని సులువు అయింది. దేవుడే లేని చోట వారు ఎలా హిందూ మతాన్ని గౌరవిస్తారు అంటూ దూకుడుగా త్రిపురలో బీజేపీ దూసుకెళ్ళింది. జనం మధ్యలోనే ఉంటూ హిందూ సెంటిమెంట్ ని రాజేసింది. అక్కడ కూడా వరసగా హిందూ ఆలయాల మీద ఇదే తరహాలో అప్పట్లో దాడులు జరిగేవట. దాంతో హిందువుల భక్తినే పెట్టుబడిగా పెట్టి బీజేపీ చేసిన పోరాటానికి మాణిక్ సర్కార్ గద్దె దిగాల్సి వచ్చింది. ఇపుడు ఏపీలో చూసుకుంటే సీన్ అలాగే ఉంది. ఏపీలో క్రైస్తవ మత విశ్వాసకుదు జగన్ సీఎంగా ఉంటున్నారు. దాంతో బీజేపీ అదే ఫార్ములాను వర్కౌట్ చేస్తోంది అంటున్నారు.ఇక మరో విషయం ఏంటి అంటే త్రిపుర బీజేపీ ఇంచార్జిగా ఉన్న సునీల్ డియోదర్ ఇపుడు ఏపీకి ఇంచార్జిగా ఉన్నారు. అలాగే ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న సోము వీర్రాజు బీజేపీ రధ సారధిగా నియమితులయ్యారు. ఇక కాషాయం పార్టీ జోరు మామూలుగా లేదు అంటున్నారు. వెతికి చూస్తే ఏపీలో ఎక్కడో ఒక చోట ఏదో ఆలయంలో అపచారం కనిపిస్తుంది. దాన్ని పదింతలు చేసి జనాల ముందు పెడితే చాలు జగన్ మీద మెజారిటీ ప్రజలలో మార్పు మెల్లగా వస్తుందని బీజేపీ ప్లాన్ గా ఉంది అంటున్నారు. మరి ఇప్పటికైతే దీనీ విరుగుడు మంత్రం ఏదీ వైసీపీ నేతల వద్ద లేదు. వివాదం చెలరేగాక దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడమే వైసీపీ చేస్తున్న పని. అంటే వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో ఉంటే బీజేపీ చెలరేగుతోంది అన్న మాట. ఇదే సీన్ కొనసాగితే మాత్రం కొత్త ఏడాది నాటికి ఏపీలో రాజకీయ వాతావరణం మారుతుంది అంటున్నారు. చూడాలి మరి జగన్ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో.

Related Posts