YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఒరేయ్ బుజ్జిగా..సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది - యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్

ఒరేయ్ బుజ్జిగా..సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది - యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్

ఇష్క్‌,  ల‌వ్‌లీ, మ‌నం, హార్ట్ ఎటాక్‌, గోపాల గోపాల‌, టెంప‌ర్, సోగ్గాడే చిన్ని నాయ‌న, కాట‌మ ‌రాయుడు, పైసా వ‌సూల్ వంటి విజ‌య‌వంతమైన చిత్రాల ద్వారా సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్‌.  గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, ఒక‌లైలాకోసం వంటి మ్యూజిక‌ల్ హిట్స్ త‌ర్వాత విజ‌య్ కుమార్ కొండా, అనూప్ రూబెన్స్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న మూడ‌వ‌ చిత్రం ఒరేయ్ బుజ్జిగా..యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంట‌గా  శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో  అనూప్ స్వ‌ర ప‌రిచిన అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం  అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6 గంట‌లకు ఆహా ఓటీటీలో విడుద‌ల‌వ‌నుంది.
ఈ సంద‌ర్భంగా యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఇంట‌ర్వ్యూ.
ఒరేయ్ బుజ్జిగా.. ఎలా ఉండ‌బోతుంది?
- క‌రీంన‌గ‌ర్‌లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత లాక్‌డౌన్ మొద‌లైంది. మ‌ళ్లీ ఈ సినిమా ఫంక్ష‌న్‌తోనే ఓపెన్ కావ‌డం చాలా సంతోషంగా ఉంది. బ్యాక్‌టునార్మ‌ల్ అనే ఫీలింగ్ వ‌చ్చింది. ఒరేయ్ బుజ్జిగా ఒక రొమ్‌కామ్‌, ఔట్ అండ్‌ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమాలో చాలా మంచి సాంగ్స్ కుదిరాయి. దేనిక‌దే విభిన్నంగా ఉండే పాట‌లతో ఈ సినిమా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, ఒక‌లైలాకోసం త‌ర్వాత నాది మ‌రియు విజ‌య్ కుమార్ కాంభినేష‌న్‌లో వ‌స్తోన్న మూడ‌వ చిత్ర‌మిది. విజ‌య్ నాకు బ్ర‌ద‌ర్ లాంటి వాడు. ఆయ‌న‌తో చేసిన గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాని ఆడియ‌న్స్ ఎంత ఎంజాయ్ చేశారో ఈ సినిమాని కూడా అంతే ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను.
లాక్‌డౌన్‌లో మ్యూజిక్ చేశారా?
- చేశాను కాని ఎక్క‌డో కొంత అసంతృప్తి అయితే ఉంది అనిపించింది. ఎందుకంటే ఇంత‌కుముందు డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ఇలా  అంద‌రం క‌లిసి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని డిస్క‌స్ చేసుకుంటూ ఒక సినిమాకి మ్యూజిక్ చేసేవాళ్లం. అయితే ఒక్క‌డినే ఇంటిద‌గ్గ‌ర‌నుండి మ్యూజిక్ చేయ‌డం కొంత క‌ష్టంగా అనిపించింది. 
లాక్‌డౌన్ లో మ‌రింత స‌మ‌యం క‌లిసొచ్చింది క‌దా ఈ సినిమా‌లో ఏమైనా చేంజెస్ చేశారా?
- లేదండీ! సినిమా రిలీజ్ అనుకున్న‌ప్పుడే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాక్ చేసి పెట్టాం. త‌ర్వాతే లాక్‌డౌన్ వ‌చ్చింది. అందుకే ఎలాంటి చేంజెస్ చేయ‌లేదు.
క్లాస్, మాస్ ఇలా అన్ని ర‌కాల సినిమాల‌కి మ్యూజిక్ చేశారు క‌దా ఎలా అన్పిస్తోంది?
-  ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా నాకు  అన్ని ర‌కాల సినిమాలు చేయ‌డం అంటేనే ఇష్టం. అయితే ల‌క్కీగా  ఇష్క్‌, మ‌నం, గోపాల గోపాల‌, టెంప‌ర్, కాట‌మ ‌రాయుడు, పైసా వ‌సూల్, పూల‌రంగ‌డు, సోగ్గాడే చిన్ని నాయ‌న.. ఇలా ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా డిఫ‌రెంట్  డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లో మ్యూజిక్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అలాగే మొద‌టిసినిమాలోనే దేశభ‌క్తి గీతం చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 55 సినిమాల‌కు మ్యూజిక్ చేశాను. ఈ సంద‌ర్భంగా నాకు అవ‌కాశాలు ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కి, నిర్మాత‌ల‌కి నా ద‌న్య‌వాదాలు.
ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ తో బాగా ట్యూన్ అయిన‌ట్టున్నారు?
- అవునండీ. ఫ‌స్ట్ సినిమా గుండెజారి గ‌ల్లంత‌య్యిందే నుండే  మా ఇద్ద‌రికి మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉంది. అయితే రెండు సంవ‌త్స‌రాల గ్యాస్ త‌ర్వాత మా ఇద్ద‌రి కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో అన్ని ఫ్లేవ‌ర్స్ లో సాంగ్స్ ఉన్నాయి. స‌రిగ‌మ అనే సాంగ్ లో  చిన్న వెస్ట్ర‌న్ ట‌చ్ ఉంటుంది. అలాగే కురిసెన కురిసెన, ఈ మాయ పేరేమిటో  రెండు సాంగ్స్ మంచి మెలొడీస్‌. కృష్ణ‌వేణి సాంగ్ లో కొంచెం మాస్ ట‌చ్ ఉంటుంది. ముఖ్యంగా  విజ‌య్ గారి సినిమాల‌లో మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉంటుంది. అన్ని సాంగ్స్ కూడా సిచ్యువేష‌న్ కి తగ్గ‌ట్టుగానే ఉంటాయి. ఈ సినిమాలో కూడా ప్ర‌తి సాంగ్ స్టోరీతో  ట్రావెల్ అవుతూనే ఉంటుంది.
ఈ సినిమాలో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సాంగ్‌?
- ఈ మాయ పేరేమిటో సాంగ్ నాకు ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఇష్టం. అలాగే కృష్ణ‌వేణి సాంగ్ కూడ ఇష్ట‌మే ఎందుకంటే ఈ పాట‌లో రాజ్ డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు.
ఒక సినిమాకి మ్యూజిక్ చేసేటప్పుడు హీరోల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటారా?
- హండ్రెడ్ ప‌ర్సెంట్ హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే మ్యూజిక్ చేస్తాను అయితే  స్టోరీని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాను.
లాక్‌డౌన్ వ‌ల్ల నీలి నీలి ఆకాశం పాట ఇంకా ఎక్కువ‌గా రీచ్ అయ్యింద‌ని భావిస్తున్నారా?
-30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాలో నేను కంపోజ్ చేసిన నీలి నీలి ఆకాశం సాంగ్ లాక్‌డౌన్‌కి ముందే ఆడియ‌న్స్‌లోకి వెల్లింది. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ సాంగ్ అంద‌రికీ పెద్ద‌ రిలీఫ్ అయ్యింది అది నాకు హ్యాపీగా అనిపించింది. మ‌నం త‌ర్వాత‌ ఆ సాంగ్‌కి  నాకు మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. అలాగే ఈ సినిమాలో ఈ మాయ పేరేమిటో, కృష్ణ‌వేణి సాంగ్స్ కూడా ఆడియ‌న్స్‌కి బాగా రీచ్‌ అవుతున్నాయి.
నిర్మాత రాధా మోహ‌న్ గురించి?
- రాధా మోహ‌న్ గారు వెరీ గుడ్ ప‌ర్స‌న్‌. నేను చాలా మంది ప్రొడ్యూస‌ర్స్‌తో వ‌ర్క్ చేశాను అయితే రాధా మోహ‌న్ గారు కూల్ ప‌ర్స‌న్. అలాగే చాలా సిస్ట‌మాటిక్‌గా ఉంటారు. ఆయ‌న‌కు  సినిమా అంటే ప్యాష‌న్. సెట్లో ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయడం  చాలా హ్యాపీగా ఉంది.
సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంది క‌దా ఎలా అన్పిస్తోంది?
మాములుగా ఓటీటీలో ఎక్కువ‌గా థ్రిల్లర్‌, హార‌ర్ సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. ఆ సినిమాల‌లో అస‌లు పాట‌లు ఉండ‌వు అయితే ఒరేయ్ బుజ్జిగా.. ఆహాలో విడుద‌ల‌య్యే ఫ‌స్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్ సినిమా అనుకుంటా. అది కూడా ఐదు మంచి పాట‌ల‌తో..ఓటీటీలో ఒక ఫ్యామిలీ అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ ఫ‌న్ ఫిలిం విడుద‌ల‌వుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
బాలు గారితో మీకున్నఅనుబందం గురించి?
- బాలు గారితో డివోష‌నల్ పాటలే ఎక్కువ‌గా పాడించాను. రీసెంట్‌గా మా అసోసియేష‌న్ కోసం టైటిల్ ట్రాక్ చేశాను. ఆ సాంగ్ బాలుగారే పాడారు. ఆ ఫంక్ష‌న్ ఓపెనింగ్‌కి కూడా వ‌చ్చారు.  ఆయ‌న‌లో ఉన్న స్పెషాలిటీ ఎంటంటే ఏ ఏజ్‌గ్రూప్ వారితో ఆ ఏజ్ ‌వారిలానే ఉంటారు. అందుకే ఆయ‌న‌తో ఎవ‌రు టైమ్ స్పెండ్ చేసిన ఒక మెమ‌రీలా ఉంటుంది. ఆయ‌న ద‌గ్గ‌ర ఒక మ్యాజిక్ ఉంది.  ఈ సంగీత ప్ర‌పంచంలో ఒక రెస్పెక్ట్‌ఫుల్ పొజిష‌న్ బాలు గారిదే. మ్యూజిక్ ఫ్యామిలీకి ఫాద‌ర్ లాంటి బాలు గారు లేక‌పోవ‌డం చాలా పెద్ద‌లోటు.
ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా ట్రెండ్‌ని ఎలా ఫాలో అవుతుంటారు?
- ట్రెండ్ అనేది ఎప్ప‌టిక‌ప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత ట్రెండ్ వ‌చ్చినా మెలొడీ అనేది ‌ఒక హార్ట్.  దానికి కొత్త  ఇన్‌స్ట్రూమెంట్స్ వ‌స్తాయి బీట్ మారుతుంది కాని ఒక హార్ట్ ట‌చింగ్ మెలోడీ ఎప్పుడూ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఇళ‌య‌రాజా గారి సాంగ్స్ తీసుకోండి. ఇప్ప‌టికీ మ‌నం వింటూనే ఉన్నాం క‌దా అలా ఎంత ట్రెండ్ మారినా ఒక మెలొడీ అనేది త‌ప్ప‌కుండా నిల‌బ‌డుతుంది అని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నా అభిప్రాయం.
మీ త‌దుప‌రి చిత్రాల గురించి?
- ప్ర‌స్తుతం రాధా మోహ‌న్ గారి ఓదెల‌ రైల్వే స్టేష‌న్‌, రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ గారి కాంభినేష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నాను. ఇవి కాకుండా మ‌రో రెండు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. అలాగే ఈ లాక్‌డౌన్‌లో కొన్ని ప్రైవేట్ సాంగ్స్ రికార్డ్ చేశాను, మంచి టైమ్ చూసుకుని ఆ పాట‌లు విడుద‌ల చేస్తాను.

Related Posts