YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శశికళ విడుదల వార్త పెను ప్రకంపనలు

శశికళ విడుదల వార్త పెను ప్రకంపనలు

చెన్నై, అక్టోబ‌రు 1,
తమిళనాడు రాజకీయాలలో జాతీయ పార్టీలకు ఉన్న పలుకుబడి అతి స్వల్పం. అక్కడ ఉనికికోసం ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా ప్రధానంగా పోటీ పడేవి రెండే పార్టీలు ఒకటి డీఎంకే...రెండు అన్నాడీఎంకే. ఈ రెండు పార్టీలూ కూడా ప్రధానంగా వ్యక్తి ఆధారిత పార్టీలు. డీఎంకే అధినేత కరుణానిథి ఆ పార్టీలో సర్వం ఆయనే...అలాగే ఎంజీఆర్ తరువాత అన్నా డీఎంకేలో సర్వం జయలలితే. కానీ ఇప్పుడు కరుణానిధీ లేరు, జయలలితా లేరు. అయితే స్టాలిన్ రూపంలో డీఎంకేకు సమర్థ నాయకత్వం లభించినా...అన్నా డీఎంకేలో మాత్రం నాయకత్వ శూన్యత అలాగే ఉండిపోయింది. జయలలిత తరువాత ఆ పార్టీలో అంతటి పట్టు ఉన్న శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలు అవ్వడంతో అన్నాడీఎంకే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.అయితే అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఏదో మేరకు నిలదొక్కుకుని పాలన కొనసాగిస్తున్నది. అయితే ఎన్నికలలో పార్టీని గెలుపు దారిలో నడిపే జనాకర్షణ ఉన్న నాయకత్వం లేని లోటు మాత్రం ఆ పార్టీని వేధిస్తూనే ఉంది. ఇక అన్నాడీఎంకే నుంచి శశికళ మేనల్లుడు (సమీప బంధువు) వేరుపడి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పేరిట సొంత పార్టీని స్థాపించారు. ఇక్కడి దాకా స్తబ్దుగా ఉన్న తమిళ రాజకీయాలు శశికళ వచ్చే నెలలో అక్టోబర్) జైలు నుంచి విడుదల అవుతారన్న సమాచారంతో ఒక్క సారిగా వేడెక్కాయి. శశికళ రంగ ప్రవేశం ప్రభావం మిగతా అన్ని పార్టీల కంటే అధికంగా అన్నాడీఎంకేపైనే ఉంటుందనడంలో సందేహం లేదు.జనాకర్షణ ఉన్న నాయకుడు లేకపోవడం, జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ పార్టీకి దూరం కావడంతో శశికళ జైలు నుంచి వస్తే అన్నా డీఎంకే క్రమక్రమంగా ఖాళీ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతలలో ఉంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకుడు దినకరన్ అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒక సారి శశికళ జైలు నుంచి బయటకు వస్తే అన్నాడీఎంకే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. అదే భయం అన్నాడీఎంకే నేతలలోనూ ఉంది. ఇక రాష్ట్రంలో మరో ప్రధాన పర్టీ, విపక్షం అయిన డీఎంకే ఈ పరిణామాలన్నీ తమకు మేలు చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. మొత్తం మీద జయలలిత మరణం తరువాత నుంచీ స్తబ్దుగా ఉన్న తమిళ రాజకీయ యవనికపై శశికళ విడుదల వార్త పెను ప్రకంపనలు రేపిందనడంలో సందేహం లేదు.

Related Posts