YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌మ‌లం చిచ్చు

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌మ‌లం చిచ్చు

హైద్రాబాద్, అక్టోబ‌రు 1, 
జ‌గన్ పదేళ్ళ రాజకీయ జీవితంతో నమ్మిందీ దోస్తీ కట్టింది ఒక్క కేసీఆర్ తోనే. ఈ ఇద్దరి స్నేహం కూడా అతి పెద్ద ఘర్షణతో మొదలైంది. జగన్ ఓదార్పు యాత్రను 2010 ప్రాంతంలో మానుకోటలో చేపడితే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని రాళ్ళతో దాడి చేశారు. ఆ తరువాత జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్రనే మానుకున్నారు. ఇక జగన్ అరెస్ట్ కావడం, పదహారు నెలలు జైలు జీవితం, ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోవడం వంటి పరిణామాల నేపధ్యంలో తెర వెనక కెసీయార్ జగన్ బంధం గట్టిపడింది. ఎటూ రాష్ట్రాలు వేరు అవుతున్నందువల్ల వివాదాలు ఎందుకని స్నేహమేరా జీవితం అనుకున్నారు ఇద్దరూ.
ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కేసీయార్ కలవరించేవారు. అనుకున్నట్లుగా 2019 ఎన్నికల నాటికి జగన్ సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి కేసీయార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ తరువాత హానీమూన్ కొన్నాళ్ళు భలేగా సాగింది. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ ఇపుడు ఇద్దరూ బద్ధ శత్రువులు అయిపోయారు. జగన్ ఊసు ఎత్తితే కేసీయార్ మండిపోతున్నారు. నీటి తగాదాలతో మొదలైన ఇద్దరు సీఎంల రాజకీయం ఇపుడు జాతీయ స్థాయిలో రెండు భిన్న మార్గాలుగా మారింది. మోడీకి చెరో వైపు రెండు రాష్ట్రాల సీఎంలు నిలబడిన సీన్ ఇపుడు కనిపిస్తోంది.నేను అన్నం పెట్టి ఆతిధ్యం ఇస్తే మా నోట్లోనే మట్టికొడతారా అంటూ రాయలసీమ ఎత్తిపోతల పధకం మీద కేసీయార్ గుస్సా అయ్యారు. జగన్ ని తేలికగా తీసిపారేస్తూ మాట్లాడారు. దాని మీద జగన్ ఆగ్రహించారని కూడా ప్రచారం జరిగింది. అయితే జగన్ బయటకు మాట్లాడకుండా సైలెంట్ గానే తన పని తాను చేసుకుపోతున్నారు. మరో వైపు చూస్తే తాజాగా హరీష్ రావు జగన్ ని మోడీ ఇచ్చే నిధులకు ఆశపడి రైతుల పొట్టకొడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణాకు రెండున్నర వేల కోట్లు, ఏపీకి నాలుగు వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశపెట్టింది. అయినా రైతులు వాడే మోటార్లకు మేము మీటర్లు బిగించడానికి వ్యతిరేకించాం, జగన్ మాత్రం మోడీ నిధులకు ఆశపడ్డారు అంటూ హరీష్ చేసిన కామెంట్స్ మంట పుట్టించేవే.ఇవన్నీ ఇలా ఉంటే కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ కి జగనే అసలైన ఇంధనం. జగన్ దన్ను చూసుకునే 42 ఎంపీ సీట్లు తన ఖాతాలో వేసుకుని ఢిల్లీలో దర్జా చూపించాలని కేసీయార్ ఉబలాట పడుతున్నారు. కానీ జగన్ అడ్డం తిరగడమే కాదు, మోడీకి జై అంటూంటే కేసీయార్ కి బాగా కాలుతోందిట. పైగా అన్నదమ్ములుగా ఉందాం, కేంద్రాన్ని కలసి నిలదీద్దామని జగన్ ఏమీ కానపుడు రెండేళ్ళ క్రితం కొడుకు కేటీయార్ ద్వారా గులాబీ బాస్ రాయబారం పంపించారు. ఆ తరువాత ఫెడరల్ ఫ్రంట్ కి అనుకూలంగా జగన్ కూడా మాట్లాడారు, ఇపుడు మాత్రం మళ్ళీ మోడీ పీఎం కావడానికే జగన్ బాటలు వేసేలా మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆగ్రహిస్తున్న గులాబీదళాలు జగన్ని ముళ్ళతో గుచ్చేస్తున్నాయి. మొత్తానికి మోడీని నమ్మి జగన్ ఎంతవరకూ బాగుపడతారో కానీ బంగారం లాంటి ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య చిచ్చుని బీజేపీ బాగానే రాజేసింది అంటున్నారు.

Related Posts