YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ టార్గెట్ గా సైబ‌ర్ క్రైంలు

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ టార్గెట్ గా సైబ‌ర్ క్రైంలు

హైద్రాబాద్, అక్టోబ‌రు 1, 
పోలీసులు, పొలిటికల్‌ లీడర్స్‌ నుంచి మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్‌బుక్‌ వేదికగా మిమ్మల్ని బుక్‌ చేసేందుకు నకిలీగాళ్లు..కాచుకు కూర్చున్నారు. మిమ్మల్ని నిండా ముంచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనం.పోలీసులే టార్గెట్‌గా ఫేక్‌ అకౌంట్స్‌.. స్నేహితుల జాబితాలో ఉన్నవారికి రిక్వెస్ట్‌లు.. చాట్‌ చేసి..అత్యవసరమంటూ నగదు డిమాండ్‌.. ఇటీవల తరచుగా వెలుగులోకి చీటింగ్‌ ఘటనలు ఫేస్‌బుక్‌ వేదికగా సైబర్‌ కేటుగాళ్లు, కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో కాస్త పలుకుబడి, హోదా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. భద్రత లేని ఖాతాలను గుర్తించి అందులో ఉన్న ఫోటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు.ఆ తర్వాత వాటిని ఉపయోగించి అదే పేరుతో నకిలీ ఖాతాను తెరుస్తున్నారు. వాటి ఆధారంగా ఆ ఖాతాలో అప్పటికే ఉంటున్న స్నేహితులకు మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్టులను పంపిస్తున్నారు. వాటిని చూస్తున్న స్నేహితులు కొన్ని అనివార్య కారణాలతో మరో ఖాతా తెరచి ఉంటాడని భావించి ఆ రిక్వెస్టులను అంగీకరిస్తున్నారు.ఆ తర్వాత కేటుగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మొదటగా కొన్ని రోజులు చాట్‌ చేస్తున్నారు. సదరు స్నేహితుడ్ని కుశల ప్రశ్నలు అడగడంతో పాటు.. తన పనితీరు ఎలా ఉందని అడుగుతున్నారు. తియ్యని మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంతపెద్ద అధికారి తనతో ఈ విధంగా మాట్లాడుతుండటంతో వారి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతోంది.ఆ తర్వాత తనకు డబ్బు అవసరం పడిందని, ఇప్పుడు ఇస్తే కొన్ని గంటల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు. వెంటనే తనకు సంబంధించి ఈ-వ్యాలెట్‌ల నంబర్లను పంపించి..సదరు ఖాతాకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి చీటింగ్‌ ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఓ సీఐ పేరుతో ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడో సైబర్‌ చీటర్‌.మల్లేశ్ జనగామ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. సీఐ పేరిట ఓ సైబర్‌ కేటుగాడు నకిలీ నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. అనంతరం సీఐ స్నేహితులతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఓ వ్యక్తికి ముందుగా హలో.., హౌవ్ ఆర్‌ యూ.., అంటూ బాగోగులు తెసుకున్నాక రంగంలోకి దిగాడు. మీకు గూగుల్ పే ఉందా.. అర్జెంట్‌గా 20 వేలు పంపించు, ఆ డబ్బులు రేపు తిరిగి ఇస్తానంటూ చాట్‌ చేశాడు.అనుమానం వచ్చిన సదరు వ్యక్తి, వెంటనే సీఐకు ఫోన్‌ చేశాడు. స్నేహితుడి నోట ఆ మాట విన్న సీఐ ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆ ఫేక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయించాడు. సైబర్‌ నేరగాళ్ల మాయలో పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సీఐ మల్లేశ్‌ సూచించారు.అంతకుముందు కర్నూలు జిల్లాలో ఎస్‌ఐల పేరుతో చీటింగ్‌కు పాల్పడిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నందివర్గం ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేశాడో సైబర్‌ చీటర్‌. అనంతరం ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి పాణ్యం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సుబ్బారెడ్డికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపాడు. నిజమేనని నమ్మేసిన హోంగార్డు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు.ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసిన వెంటనే ఆ కేటుగాడు…అర్జెంటుగా 10 వేలు లేదా 50 వేలు కావాలని…ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మెసేజ్‌ పెట్టాడు. అయితే ఎస్ఐ తనను డబ్బులు అడగడమేంటని అనుమానం వచ్చిన హోంగార్డు…నిజమో..కాదో.. తెలుసుకునేందుకు ఆ ఎస్‌ఐకి ఫోన్‌ చేశాడు. అయితే ఆ ఫేస్‌బుక్‌ ఖాతా తనది కాదని తెలుసుకున్న ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి ప్రమత్తమయ్యాడు. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టే పనిలో పడ్డాడుఇక..ఈ ఘటనకు రెండు, మూడు రోజలు ముందు, మరో ఎస్ఐ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి..అత్యవసరంగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పంపాడో కేటుగాడు. ఎస్ఐ శ్రీనివాస్‌ పేరుతో కానిస్టేబుల్‌ రామాంజుల నాయక్‌కు 9 వేలు కావాలంటూ మెసేజ్‌ పంపాడు. నిజమే అనుకున్న ఆ కానిస్టేబుల్‌ 9 వేలు పంపేందుకు సిద్ధమయ్యాడు.అయితే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కాకపోవడంతో..డబ్బులు వెళ్లడం లేదని ఎస్ఐకి వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు. దీంతో తనకు ఎందుకు డబ్బులు పంపాలనుకుంటున్నావ్‌ అంటూ శ్రీనివాస్‌ నుంచి రిప్లయ్ రావడంతో..తాను మోసపోయినట్లు కానిస్టేబుల్‌ గ్రహించాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు,  కేటుగాడిని హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Related Posts